చైనాను దాటిపోనున్న భారత జనాభా
న్యూఢిల్లీ: భారతదేశంలో శిశు జననాల రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని, 2028 నాటికి మన జనాభా చైనాను దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ జనాభా అంచనాల ప్రకారం భారత జనాభా వేగంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో మంగళవారం తెలిపారు.
జనాభా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కొంత వరకు ఫలితాన్నిస్తున్నాయన్నారు. 1991-2000 మధ్యకాలంలో 21.54 శాతంగా ఉన్న జనాభా వృద్ధిరేటు.. 2001-2011 దశాబ్దానికి 17.64కు తగ్గిపోయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆషా సంస్థల ద్వారా గర్భ నిరోధక సాధనాలను ఇంటివద్దకు అందించే కార్యక్రమం జరుగుతున్నదని నడ్డా చెప్పారు.