భారత్లో ఫాస్టెస్ట్ ట్రైన్ రెడీ | Indias fastest train completes final test run in record time | Sakshi
Sakshi News home page

భారత్లో ఫాస్టెస్ట్ ట్రైన్ రెడీ

Published Wed, Jun 3 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

భారత్లో ఫాస్టెస్ట్ ట్రైన్ రెడీ

భారత్లో ఫాస్టెస్ట్ ట్రైన్ రెడీ

ఆగ్రా: భారత్లో అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇక పట్టాలకు మీదకు రాబోతోంది. ఈ రైలును చివరిగా ఆరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ ఫాస్టెస్ట్ ట్రైన్ 115 నిమిషాల్లో 195 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. గంటకు గరిష్టంగా 160 పైచిలుకు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జూన్ రెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభిస్తారని భావిస్తున్నారు. ఇందులో 12 అధునాతన కోచ్లు ఉన్నాయి.

ఈ రైలు మంగళవారం ఉదయం 11:15 గంటలకు ఢిల్లీలో బయల్దేరి మధ్యాహ్నం 1:10 గంటలకు ఆగ్రాకు చేరింది. నిర్ణీత సమయం కంటే 10 ఆలస్యంగా గమ్యస్థానం చేరినట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2:20 ఆగ్రాలో తిరుగుపయనమై సాయంత్రం 4:25 గంటలకు ఢిల్లీ చేరింది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement