gatimaan express
-
గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది
-
ఆ రైళ్లతో పోలిస్తే మన గతిమాన్ ఎక్కడ?
న్యూఢిల్లీ: గతిమాన్ హైస్పీడ్ రైలు ప్రారంభంతో భారతీయ రైల్వే సంస్థ ఆధ్వర్యంలో నడిచే రైల్లు ఇక మున్ముందు మరింత వేగంగా, తక్కువ సమయంలో దూరాలకు చేరవేస్తాయని సంకేతాలు వెలువడ్డాయి. ప్రస్తుతం దేశంలోనే వేగవంతమైన రైలుగా గతిమాన్ ఎక్స్ ప్రెస్ ను పేర్కొంటూ భారతీయ రైల్వే మంగళవారం ప్రారంభించింది. ఇది ఢిల్లీ నుంచి ఆగ్రా మధ్య ఉన్న 188 కిలోమీటర్ల దూరాన్ని 100 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు. అయితే, దేశంలోనే అత్యధిక వేగంగా ప్రయాణించే రైలుగా చెప్పుకునే ఈ గతిమాన్ ఎక్స్ ప్రెస్ ప్రపంచ దేశాల్లోని కొన్ని రైళ్లతో పోల్చి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే.. షాంఘై మాగ్లేవ్: ఇది చైనాలో ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 430 కిలోమీటర్లు. షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సెంట్రల్ పుడాంగ్ కి మధ్య 30 కిలోమీటర్లు కవర్ చేసేందుకు దీనిని ఏర్పాటుచేశారు. ఈ 30 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 8 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇండియాలోని గతిమాన్ స్థానంలో ఈ రైలును పెడితే ఢిల్లీ నుంచి ఆగ్రాకు మధ్య 25 నుంచి 27 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. గ్రండే విటెస్సీ: ఫ్రాన్స్‌కు చెందిన గ్రండే విటెస్సీ అనే రైలు వేగం గంటకు 300 కిలోమీటర్లు. దీనిని గతి మాన్ ప్లేస్ లో పెడితే 20 నుంచి 21 నిమిషాల్లో పూర్తి చేస్తుందట. ఏజీవీ ఇటాలో: ఇది ఇటలీలోని వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 300 కిలోమీటర్లు. దీనిని న్యూఢిల్లీ ఆగ్రా మధ్య పరుగులు పెట్టిస్తే 25 నుంచి 30 నిమిషాల్లో పరుగు పూర్తి చేస్తుందంటున్నారు. యూరోస్టార్: ఇది ఇంగ్లాండ్‌లోని వేగవంతమైన రైలు. దీని వేగం కూడా గంటకు 300 కిలోమీటర్లు. ఇది కూడా గతి మాన్ ప్లేస్‌లోకి వస్తే 25 నుంచి 30 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంటుందట. ఏసిలా ఎక్స్ ప్రెస్: ఇది అమెరికాలోని వేగవంతమైన రైలు. దీని వేగం గంటకు 240 కిలోమీటర్లు. ఈ రైలును గతిమాన్ తో పోలిస్తే ఢిల్లీ-ఆగ్రాల మధ్య ప్రయాణం 48 నిమిషాల్లో పూర్తి చేస్తుందట. -
పట్టాలెక్కిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు 'గతిమాన్ ఎక్స్‌ప్రెస్' పట్టాలెక్కింది. మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు ఇది. ఈ తొలి హైస్పీడు రైలు ఢిల్లీ, ఆగ్రాల మధ్య పరుగులు పెడుతోంది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా స్టేషన్ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకోనుంది. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో బయలుదేరి, 11:40 నిమిషాలకు ఆగ్రా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. గతిమన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తప్ప మిగితా అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత భారతీయ రైల్వే తన అత్యధిక వేగమైన రికార్డును తిరగరాసినట్లు అయింది. కాగా ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్‌లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. -
భారత్‌లో ఫాస్టెస్ట్ ట్రైన్ రెడీ
ఆగ్రా: భారత్‌లో అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఇక పట్టాలకు మీదకు రాబోతోంది. ఈ రైలును చివరిగా ఆరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ ఫాస్టెస్ట్ ట్రైన్ 115 నిమిషాల్లో 195 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. గంటకు గరిష్టంగా 160 పైచిలుకు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జూన్ రెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభిస్తారని భావిస్తున్నారు. ఇందులో 12 అధునాతన కోచ్‌లు ఉన్నాయి. ఈ రైలు మంగళవారం ఉదయం 11:15 గంటలకు ఢిల్లీలో బయల్దేరి మధ్యాహ్నం 1:10 గంటలకు ఆగ్రాకు చేరింది. నిర్ణీత సమయం కంటే 10 ఆలస్యంగా గమ్యస్థానం చేరినట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2:20 ఆగ్రాలో తిరుగుపయనమై సాయంత్రం 4:25 గంటలకు ఢిల్లీ చేరింది.