స్టెప్పులతో దుమ్మురేపిన డాక్టర్లు
డాక్టర్లు ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటారు. విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులు, ఆస్పత్రి షిఫ్టులతోనే వారికి సరిపోతుంది. వ్యక్తిగత జీవితాన్ని వారు ఎలా ఆస్వాదిస్తారన్నది చాలా తక్కువమందికి తెలుసు. కానీ, డాక్టర్లు కూడా సింగింగ్, డ్యాన్సింగ్‌ను ఇష్టపడతారు. పాటలు పాడుతూ.. స్టెప్పులు కూడా వేస్తారు. అవును.. డాక్టర్లే ఇలా స్టెప్పులు వేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను ఊపేస్తోంది. ఇండోనేసియాకు చెందిన వైద్యులు ఔట్‌డోర్ స్పాట్‌లో ఓ పెప్పీ సాంగ్‌కు స్టెప్పులు వేశారు.
ముఖానికి మాస్కులు కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని వారు వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, చేతులను శుభ్రంగా ఎలా కడుక్కోవాలో సందేశం ఇచ్చేలా వారు ఈ వీడియోలో స్టెప్పులు వేయడం గమనార్హం. ఈ వీడియో ప్రారంభంలో ముఖానికి మాస్కులు కట్టుకున్న డాక్టర్లు కాసేపయ్యాక నవ్వుతూ.. మాస్కులు, కళ్లద్దాలు తీసేసి.. తమ ముఖాలను వీక్షకులకు చూపిస్తారు. ఫేస్‌బుక్‌లోని ప్రముఖ గ్రూప్ డాక్టర్ నాలెడ్జ్ షేర్ చేసుకున్న ఈ వీడియోను 17 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు.