రాజకీయాల్లోకి ఇరోమ్ షర్మిళ!
ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల (42)... 14 ఏళ్ల తర్వాత వచ్చే నెల 9న తన నిరహార దీక్షను విరమించనున్నారు. సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలంటూ అసోంలో ఆమె గత కొన్ని సంవ్సతరాలుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టీపీఎన్ (టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్) ద్వారా ఆమె జీవిస్తున్నారు. ఆగస్టు 9న దీక్ష విరమించిన తర్వాత ఆమె వివాహం చేసుకుంటారని ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
2000 నవంబర్ లో భద్రతా దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కు వ్యతిరేకంగా షర్మిల దీక్షను ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో ఈ అధికారాన్ని ఆర్మీ వినియోగించుకునే హక్కు ఉంటుంది. షర్మిల దీక్షకు కొద్ది రోజుల ముందు ఇంఫాల్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు.