నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ23 | ISRO's PSLV-C23 launched at 9:52 am | Sakshi
Sakshi News home page

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ23

Published Mon, Jun 30 2014 9:50 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ23 - Sakshi

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ23

నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో మైలురాయిని దాటింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్ సోమవారం ఉదయం 9.52 గంటలకు  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహననౌక పీఎస్‌ఎల్‌వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లింది. షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 42 ప్రయోగాలు జరిగాయి. ఈ పిఎస్‌ఎల్‌వి-సి 23 ప్రయోగం 43వది కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 27వది కావడం విశేషం.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్‌కు చేరుకొని స్వయంగా రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ ఉన్నారు. కాగా ప్రయోగం అనంతరం ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement