
సాక్షి, చెన్నై: తమిళనాడులో శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రైవేటు సంస్థలు, ఫైనాన్షియర్ల గృహాలు, కార్యాలయలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పీఎస్కే కన్‌స్ట్రక్షన్ సంస్థకు చెందిన కార్యాలయాలపై 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. అలాగే చెన్నై, తిరునల్వేలిలలోని ఆకాశ్ భాస్కర్, సుజయ్ రెడ్డి అనే ఫైనాన్షియర్లల నివాసాలు, కార్యాలయాలపై 11 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్నికల్లో భారీగా నగదు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఐటీ అధికారులు ఈ దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా తమిళనాడులోని అన్ని పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 18న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment