ఆయన వల్లే ఆనందీ బెన్ రాజీనామా! | It Was Amit Shah, Not Age, Say Anandiben Supporters A Day After She Quit | Sakshi
Sakshi News home page

ఆయన వల్లే ఆనందీ బెన్ రాజీనామా!

Published Tue, Aug 2 2016 3:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆయన వల్లే ఆనందీ బెన్ రాజీనామా! - Sakshi

ఆయన వల్లే ఆనందీ బెన్ రాజీనామా!

అహ్మదాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ సన్నిహిత మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె వయోభారంతో రాజీనామా చేయలేదని, దాని వెనుక అమిత్ షా ఉన్నారని అన్నారు. వాస్తవానికి ఆమెకు పాలనా స్వేచ్ఛను ఇస్తే వచ్చే నవంబర్ లో ఆమె 75 వసంతంలోకి అడుగుపెట్టాక స్వచ్ఛందంగా తాను సీఎం బాధ్యతల నుంచి తప్పుకునేవారని, కానీ, ఆమెతో రాజీనామా చేసే పరిస్థితులు సృష్టించి ఆ పనిచేయించారని వారు అంటున్నారు.

వాస్తవానికి ప్రధాని మోదీ సీఎంగా ఆనందీ బెన్ కు బాధ్యతలు అప్పగించినప్పటికీ.. కమాండింగ్ మాత్రం అమిత్ షా చేతిలో ఉందంట. రాష్ట్ర పాలనా యంత్రాంగంలోని సీనియర్ అధికారులు సైతం అమిత్ షానే ముఖ్య విషయాలపై కలుస్తూ ఉన్నారంట. దీనిపై ఆనందీ బెన్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు వారు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement