సోషల్ మీడియాకు సంబంధించి పౌరుల భావప్రకటన హక్కును పరిరక్షించే దిశగా అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన మైలురాయి లాంటి తీర్పు ఇదని సోషల్ మీడియా యూజర్లు, హక్కుల ఉద్యమకారులు అభివర్ణిస్తున్నారు.
‘చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి షాహీన్ ఆ వ్యాఖ్య చేయలేదు. అది చాలా సాధారణ వ్యాఖ్య. ఇకనైనా ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం అగిపోతుందని ఆశిస్తున్నా’
- ఫారూఖ్ ధాడ (బాల్ ఠాక్రే మృతి సమయంలో ఫేస్‌బుక్‌లో ‘ముంబై షట్‌డౌన్’ను ప్రశ్నించి, అరెస్టైన షాహీన్ తండ్రి)
‘వెరీ హ్యాపీ. నాకు ఈరోజు న్యాయం జరిగింది. తప్పులకు వ్యతిరేకంగా గళమెత్తేవారికి ఊతమిచ్చే తీర్పు ఇది’
- రీను శ్రీనివాసన్ (షాహీన్ కామెంట్‌ను లైక్ చేసి అరెస్టైన వ్యక్తి)
‘ఇది సామాన్యుడి భావ ప్రకటన స్వేచ్ఛకు లభించిన విజయం. సోషల్ వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్న చాలామందిలో ఈ సెక్షన్‌పై పెరుగుతున్న భయాందోళనలు ఇకనైనా సమసిపోతాయని ఆశిస్తున్నా’
- అంబికేశ్ మహాపాత్ర(పశ్చిమబెంగాల్‌లోని జాధవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ముఖ్యమంత్రి మమతబెనర్జీని కించపర్చే ఈ మెయిల్‌లను పలువురికి పంపించాడన్న ఆరోపణలపై ఆయనను కూడా ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు)
ఇది సామాన్యుడి విజయం
Published Wed, Mar 25 2015 2:50 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement