ముమ్మరంగా సహాయక చర్యలు..
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16 కి చేరింది. బుద్గం జిల్లా లాడెన్ గ్రామంలో ఆరు మృతదేహాలను మంగళవారం స్వాధీనం చేసుకోవడంతో ఈ సంఖ్య పదహారుకు చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దాదాపు ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ దళాలు ముమ్మరంగా రక్షణచర్యల్లో పాలుపంచుకుంటున్నాయని ఆయన తెలిపారు.
మరోవైపు కేంద్రప్రభుత్వం 200కోట్ల తక్షణ సహాయాన్నిప్రకటించింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.రాష్ట్రముఖ్యమంత్రి ముఫ్తీమహ్మద్ సయీద్ శ్రీనగర్ లాల్చౌక్లో పర్యటించారు. రాష్ట్ర అగ్నిమాపక దళం, అత్యవసర సేవల విభాగం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది.
భారీ వర్షాలతో జీలం నది ప్రమాదస్థాయిని దాటి ఉప్పొంగడంతో జమ్మూకశ్మీర్ అతలాకుతలమైంది. రాజధాని శ్రీనగర్ సహా అనేక ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.