‘ఈశాన్యా’నికి ఇక దిక్కెవరు? | who is responsibility of Residents of northeastern India | Sakshi
Sakshi News home page

‘ఈశాన్యా’నికి ఇక దిక్కెవరు?

Published Sun, Oct 5 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

‘ఈశాన్యా’నికి ఇక దిక్కెవరు?

‘ఈశాన్యా’నికి ఇక దిక్కెవరు?

కాశ్మీర్‌నూ, ఈశాన్య భారతాన్నీ దాదాపు ఒక్కసారే, ఈ సెప్టెంబర్ మాసంలో వరదలు ముంచెత్తినా ఆ రెండు ప్రాంతాల పట్ల కేంద్రం ప్రదర్శించిన  తీరుతో ఈశాన్య భారతవాసులు అలాంటి ప్రశ్న వేసుకోక తప్పని పరిస్థితిని కల్పించాయి. దానితో పాటు ఈ దేశంలో ప్రసార మాధ్యమాలకు కూడా ఈశాన్య భారతమంటే చులకనేనా?
 
ఆరోగ్యానికి అల్లం, అందానికి కాశ్మీర కుంకుమ పువ్వు కావాలి. దేశ రాజధాని ఢిల్లీ కూరగాయల దుకాణాలలో దొరికే అల్లం ఈశాన్య భారతంలో పం డినదే. కానీ ఢిల్లీ పాలకులు కుంకం పూలు విరిసే కాశ్మీరానికి ఇచ్చిన ప్రాధాన్యం అల్లం పండించే ఈశాన్య భారతానికి ఎందుకు ఇవ్వడం లేదు? ‘అల్లం వ్యాపారి నౌకల గురించి తెలుసుకోనక్కర లేదు’ అని అస్సాంలో ఓ సామెత వినిపిస్తుంది. కానీ అలాంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఇప్పుడు ‘సెవెన్ సిస్టర్స్’ ప్రజలు ఆరాటపడుతు న్నారు. కాశ్మీర్‌నూ, ఈశాన్య భారతాన్నీ దాదాపు ఒక్కసారే, ఈ సెప్టెంబర్ మాసంలో వరదలు ముం చెత్తినా ఆ రెండు ప్రాంతాల పట్ల కేంద్రం ప్రదర్శిం చిన  తీరుతో ఈశాన్య భారతవాసులు అలాంటి ప్రశ్న వేసుకోక తప్పని పరిస్థితిని కల్పించాయి. దానితో పాటు ఈ దేశంలో ప్రసార మాధ్యమాలకు కూడా ఈశాన్య భారతమంటే చులకనేనా? అక్కడ సంభ వించిన ప్రకృతి విలయం గురించిన వార్తల పట్ల కూడా వివక్షేనా? అన్న ప్రశ్నలు ఉదయించాయి.
 సెప్టెంబర్ మూడో వారం ఆరంభం నుంచి కొద్దిరోజుల పాటు కుండపోత వర్షాలు, వరదలతో ఈశాన్య భారత రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాం, మేఘాలయ అతలాకుతలమైనాయి. అక్టోబర్ 2 నాటికి తేల్చిన లెక్కల ప్రకారం 70 మంది ఈ విప త్తుకు బలైనారు. మూడు దశలుగా వచ్చిన ఈ వర దలూ వర్షాలకూ మట్టి పెళ్లలు విరిగిపడిన దుర్ఘటన లలోనూ ఒక్క అస్సాంలోనే 42 లక్షల మంది నష్టపో యారు. నాలుగున్నర వేల గ్రామాలు ధ్వంసమైనా యి. 55 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్క మేఘాల యలో 35 మంది చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల లోనూ వంతెనలు, కార్యాలయాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు కారణంగా ఈశాన్య భారతంలో 28 జిల్లాలు దెబ్బతింటే అందులో  23 జిల్లాలు ఒక్క అస్సాంలోనే ఉన్నాయి. రూ.4,350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధి కారులు తేల్చారు.
 ఈశాన్య భారతంలో ఈ వైపరీత్యానికి నాలు గైదు రోజుల ముందే వరదలూ, వర్షాలతో  కాశ్మీర్ కకావికలైంది. 280 మంది చనిపోయినట్టు లెక్కలు అందాయి. ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావంతో 12.50 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రూ. 1,00,000 కోట్లు నష్టం వాటిల్లినట్టు నిర్ధారించారు. విపత్తు సంభవించగానే ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా గుర్తిస్తూ వేయి కోట్ల రూపా యలు తక్షణ సహాయం ప్రకటించారు. తరువాత కూడా అనేక సంస్థలు, మీడియా సంస్థలు కాశ్మీర్ వరద బాధితులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు చేసి, నిధి సేకరణ ఏర్పాట్లు చేశాయి.

కానీ ఈశాన్య భారత రాష్ట్రాలలో సంభవించిన వరదలు, జరిగిన నష్టం తక్కువేమీ కాదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకువచ్చారు. ప్రజలు ప్రధాని మోదీ పర్యటించాలని కోరారు. కానీ ఇంతవరకు ఢిల్లీలో సమీక్షా సమావేశాలు నిర్వ హించడం మినహా మోదీ ఈశాన్య భారత పర్య టనకు సిద్ధం కాలేదు. నిజానికి 2014 సంవత్స రంలో సంభవించిన వరదలూ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలలో మొత్తం 179 మంది చనిపో యారు. ఇంతవరకు రూ.887 కోట్లు కేంద్రం మం జూరు చేసింది. ఇందులో రూ.674 కోట్లు ఒక్క అస్సాంకే ఇచ్చారు. ఆ మాటెలా ఉన్నా 2005లో ముంబై నగరం కుండపోతలో చిక్కుకుపోయినపుడు కేంద్రం మంజూరు చేసిన పరిహారం రూ.476 కోట్లు. ఇంతకీ, కాశ్మీర్‌కు తక్షణ సాయం వేయి కోట్లు ప్రకటించడానికి కారణం, ఆగమేఘాల మీద ఆదు కోవడానికి కారణం- ఆ రాష్ట్ర అసెంబ్లీ త్వరలో ఎన్ని కలు జరుపుకోబోతూ ఉండడమేనని, అందుకే మోదీ వెంటనే స్పందించారని ‘షిల్లాంగ్ టైమ్స్’ పత్రిక సంపాదకురాలు పెట్రిషియా ముకీమ్  వ్యాఖ్యానించడం గమనార్హం. ఈశాన్య భారతం లోని వేర్పాటువాదం గురించి, రక్తపాతం గురించి దేశంలో మీడియా చూపించే ఆసక్తి ఇక్కడి సాధారణ ప్రజల ఇక్కట్ల పట్ల చూపడం లేదని కూడా ఆమె విమర్శించారు. జాతీయ మీడియా ఇంత చిన్న చూపు చూడడం వల్లనే సరైన సమాచారం బయ టకు రాలేదని చెప్పేవారూ ఉన్నారు. అన్ని ప్రధాన పత్రికలకూ, చానళ్లకూ ఇక్కడ శాఖా కార్యాలయాలు ఉన్నప్పటికీ సరైన నెట్‌వర్క్ ఏర్పాటులో ఎవరూ శ్రద్ధ తీసుకోవడంలేదని, పార్ట్‌టైమర్లు ఇచ్చే వీడియో క్లిప్పింగులతోనే కథ నడిపిస్తున్నారని అస్సాం మాజీ ముఖ్యమంత్రి పీకే మహంత ఆరోపించారు. ప్రధాన వార్తాసంస్థలన్నీ, దేశ ప్రధాన స్రవంతి భూభాగా లకు సంబంధించినవి కావడం వల్ల ఈ ప్రాంతం సమస్యలు వాటికి పట్టడం లేదని కూడా కొందరు అస్సాం జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.

 ఎన్నికల సమయంలో ఈశాన్య భారతం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం ఇక సాగదని మోదీ ప్రకటిం చడం అందరికీ ఆనందం కలిగించింది. అది ఆచర ణలో చూపడానికి ఇంకా జాప్యం సరికాదు.

 గోపరాజు    
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement