goparaju
-
వీర జవాన్‌కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు
భట్టిప్రోలు: రాజస్తాన్‌లోని పాకిస్తాన్ బోర్డర్ జస్పల్‌మీర్ వద్ద విధి నిర్వహణలో మృతి చెందిన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్ పురమా గోపరాజు (26)కు గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జస్పల్‌మీర్ వద్ద ప్రత్యేక కవాతు నిర్వహణలో భాగంగా రైఫ్లింగ్‌లో అకస్మాత్తుగా గోపరాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి మిలటరీ అధికారులు, గ్రామస్తులు సైనిక లాంఛనాలతో భట్టిప్రోలు స్మశానవాటికకు తరలించారు. రెండు సెంట్లస్థలాన్ని రెవెన్యూ అధికారులు అమరజవాన్‌కు స్థూపం కట్టేందుకు కేటాయించారు. రాష్ట్ర సాంఘిక శాఖా మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆర్మీ జవాన్లు అమర జవాన్‌కు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం 21 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. -
గుండెపోటుతో వీర జవాను మృతి
పల్లెకోన(భట్టిప్రోలు): బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాను పురమా గోపరాజు (26) సోమవారం రాజస్తాన్‌లోని జస్పల్‌మీర్ పాకిస్తాన్ బోర్డర్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. గోపరాజు ఏడేళ్ల క్రితం మిలటరీలో చేరారు. ప్రస్తుతం మద్రాస్–6 యూనిట్లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తున్నారు. భౌతికకాయాన్ని విమానం ద్వారా హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి తీసుకురానున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పటల్లో మృతదేహాన్ని ఉంచనున్నారు. వీర జవాన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించిన అనంతరం సైనిక లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపరాజు అవివాహితుడు. గోపరాజు మృతదేహానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్, రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు తెలిపారు. కాగా, కుమారుడి మరణంతో తల్లిదండ్రులు నాంచారయ్య, మంగమ్మ, ఇతర కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వీరజవాన్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
నేతాజీ అంగరక్షకుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాలను వదిలేసి విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వాళ్లపై యుద్ధం ప్రకటించిన రోజులవి. అప్పట్లో ఆయన అంగరక్షకునిగా పనిచేసిన అచంచల దేశభక్తుడు గోపరాజు వేంకట అనంత శర్మ, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించిన ఆయన 1941లో బ్రిటిష్ ఇండియా ఆర్మీ (బీఐఏ)లో గుమాస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్‌గా ఎంపికై శిక్షణ నిమిత్తం మలేషియాలోని కోటాబహార్‌కు వెళ్లారు. బ్రిటన్– జపాన్ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది బీఐఏ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్‌కు చిక్కారు. అందులో గోపరాజు ఒకరు. జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్థుల సాయంతో భారత మాతకు విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన గోపరాజు నేతాజీని బ్యాంకాక్‌లోని రత్నకోసిన్ హోటల్లో కలిసి ఐఎన్ ఏలో చేరారు. నేతాజీ అంగరక్షకులలో ఒకరుగా పనిచేశారు. ఎప్పుడూ మిలటరీ దుస్తులలో ఉండే నేతాజీని చూసి ఎంతో ప్రేరణ, గౌరవం కలిగేదని గోపరాజు అంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియన్ నేషనల్ ఆర్మీవారిని యుద్ధఖైదీలుగా ఫిరోజ్‌పూర్ కంటోన్మెంటుకు తరలించారు. వారిలో గోపరాజు అనంత శర్మ కూడా ఉన్నారు. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) స్వాతంత్య్రోద్యమ దీప్తి నేతాజీ... కనుసన్నలలో గడిపిన మూడేళ్ల కాలం తన జీవితంలో స్వర్ణమయ సమయం అనేవారు వేంకట అనంత శర్మ. ఈయన కొంతకాలం పాటు స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సాహంతో భారతీయ రైల్వేలో ఉద్యోగిగా చేరి ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పదవీవిరమణ చేశారు. ఈమధ్య జూలై నెలలో ఐకానిక్ వారోత్సవాల వేడుకలలో అమృతోత్సవమును పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో స్వాతంత్య్ర సమరవీరులైన శర్మ కుటుంబ సభ్యులను ఉచిత రీతిన గౌరవించడం ముదావహం. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) – డాక్టర్ ధర్మాల సూర్యనారాయణ మూర్తి, చాంగీ కాండో, సింగపూర్ -
విలువైన జ్ఞాపకాలు
‘ఇవాళ్టి రాజకీయాలే, రేపటి చరిత్ర’అంటుంది చరిత్ర రచనా విధానం. ఇవాళ్టి రాజకీయాలంటే నడుస్తున్న చరిత్ర. ఈ నడుస్తున్న చరిత్రకు వ్యాఖ్యాతే మంచి పత్రికా రచయిత. రాజకీయ, సామాజిక పరిణామాలు, కళ, సంస్కృతి, ఉద్యమాలు వంటి వాటి వెంట నడుస్తాడు పత్రికా రచయిత. వాటితో తర్కిస్తాడు, విభేదిస్తాడు, సమర్ధిస్తాడు కూడా. అంతిమంగా సమకాలీన చరిత్ర ఫస్ట్ రిపోర్ట్‌ను అందిస్తాడు. అందుకే ఒక పత్రికా రచయిత జీవిత చరిత్ర సమకాలీన సామాజిక, రాజకీయ చరిత్రగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖ పత్రికా రచయిత డాక్టర్ జీఎస్ వరదాచారి ‘జ్ఞాపకాల వరద’ అలాంటి రచనే. ‘ఒకరికి వినిపించదగిన విశేషం నా జీవితంలో ఏముంది?’అని ప్రశ్నించుకుంటూ రాసుకున్న జ్ఞాపకాలివి. అందుకే బాల్యం గురించి చెప్పినా, ఉద్యోగ జీవితం గురించి వర్ణించినా సామాజిక నేపథ్యాన్ని గమనించుకుంటూనే రాశారు. ఏడు అధ్యాయాలలో (చిన్ననాటి ముచ్చట్లు, వివాహం– విద్యాభ్యాసం, జర్నలిజం వైపు మొగ్గు, ఉద్యోగపర్వం, శ్రామికాభ్యుదయం, రచనలు–పురస్కారాలు, దొరకునా ఇటువంటి సేవ?) జీఎస్ జ్ఞాపకాలు వెల్లువెత్తాయి. ‘గోవర్ధన వారి ఇంట్లో దూలాలను తడితే వేదమంత్రాలు వినిపిస్తాయి’. వరదాచారి ఇంటిపేరు అదే. స్వస్థలం ఆర్మూరు (వరదాచారి తాతగారు ఆరమూరు అని రాసేవారట). ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అదీ ఒక నానుడితో చెప్పేవారు– ‘ఆర్మూర్ ఖుదా కా నూర్, సేంధీ సజ్దీక్ పానీ దూర్’. అంటే ఆర్మూర్ దివ్యతేజం. కల్లు దగ్గర, నీరు దూరం. చుట్టూ ఈత చెట్ల తోపులు. మంచినీటికి మాత్రం క్రోసులు నడిచి వెళ్లాలి. అసలు పేరు నవనాథపురం. నిజాం పాలన, తీరుతెన్నులు అందులో ప్రతిబింబించాయి. కొన్ని హిందూ అగ్రకులాల స్త్రీపురుషులు ప్రభు వర్గీయులను అనుకరిస్తూ బురఖాలు, షేర్వాణీలు ధరించేవారు. తెలుగు భాషకు రాచ మర్యాద లేకున్నా, నాలుగో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరిగేదంటూ జీఎస్ రాసిన వాక్యాలు చారిత్రకంగా, విద్యాపరంగా ఇప్పుడూ ప్రాముఖ్యం ఉన్న సత్యాలు. అలాగే ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉండేదో అవగతమవుతుంది. జీఎస్‌కు ఉన్నత పాఠశాలలో ఉర్దూ పేపర్లో అత్యధికంగా మార్కులు వచ్చాయి. ఇదెలా సాధ్యమైందో ఇందులో చదవవలసిందే (పే 26). అప్పుడు విద్యార్థులందరికీ శుక్రవారం సెలవు. దీనిని అర్థం చేసుకోవచ్చు. తరచూ ‘నిజాంకు కొడుకు పుట్టాడు’ అంటూ సెలవులు ఇచ్చేవారు. ఇదెలా సాధ్యమనీ, ఇంతమంది ఎలా పుడతారనీ విద్యార్థులంతా ప్రశ్నించుకున్నారు. మిషనరీల కార్యకలాపాలు ఎలా ఉండేవో కూడా రచయిత వివరించారు. ఈ క్రమంలోనే రచయిత నిజాం సాగర్ ప్రాజెక్టు పరిణామం గురించి కూడా ప్రత్యేకంగా రాసుకున్నారు. ఒక నియంత నిర్మించి పెట్టిన సాగునీటి పథకం, ప్రజాస్వామ్య యుగంలో ఎండిపోయిన సంగతిని గుర్తు చేసుకోవడం ఒక అవసరం కోసమే. తరువాత మజ్లిసె (ఇలాగే రాయాలట) ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (వారే రజాకార్లు) ఆవిర్భావం, కార్యకలాపాల గురించి కూడా రచయిత జ్ఞాపకం చేసుకున్నారు. ఇన్ని అంశాలను తడిమిన వారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం, కమ్యూనిస్టుల పాత్ర గురించి చెప్పకుండా ఉండటం సాధ్యం కాదు. ‘కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదం’అనే ఉపశీర్షిక కిందే రచయిత ఆ ముఖ్యమైన అంశాన్ని వివరించారు. రజాకార్ల హింస, భూస్వామ్య వ్యతిరేక పోరాటం, ఆనాటి ఎన్కౌంటర్ల గురించి కొద్దిగానే అయినా చక్కని శైలిలో అందించారు. ఇందులో అమృత్లాల్ అనే వ్యక్తి జీవిత పరిణామం గురించి కూడా చదువుతాం. ఆయన జీఎస్ ఉపాధ్యాయుడే. ఇదంతా జీఎస్ జీవి తంలో ఒక దశను వెల్లడించే ఘటనల అక్షరరూప చిత్ర చయనిక. ఆ ఘటనల అంతరార్ధాన్ని జీఎస్ వివరించిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది. జీఎస్ పత్రికా రంగంలోకి యాదృచ్ఛికంగా వచ్చినవారు కాదు. తను చదివిన మొదటి పత్రిక ‘కృష్ణా పత్రిక’ అన్న సంగతి కూడా ఆయన గుర్తుంచుకున్నారు. అనుకోకుండా ఆ పత్రికకు పాఠకుడయ్యారు జీఎస్. 1954 ప్రాంతం నుంచి పత్రికా రచన, జర్నలిజం కోర్సుతో పరిచయం ఏర్పడినవారాయన. అంటే దాదాపు నాన్ ముల్కీ అలజళ్లు, ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి జరిగిన చరిత్రకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఒక పత్రికా రచయితగా ఈ చరిత్రను గమనించారు. సంపాదక లేఖగా జీఎస్ పంపిన రచననే ‘స్వతంత్ర’ పత్రిక వ్యాసం రూపంలో ప్రచురించిందట. అదే జీఎస్ తొలి వ్యాసం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చేసిన తరువాత ‘ది హిందూ’లో కొద్దికాలం ఇంటర్న్‌షిప్ చేశారు జీఎస్. అప్పటి అనుభవాలు కొత్తగా పత్రికా రచనలోకి వస్తున్నవారు చదివితే విస్మయం కలుగుతుంది. చిరస్మరణీయ ఉదంతం పేరుతో ఆనాటి చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మగారితో జీఎస్‌కు ఎదురైన అనుభవం వంటిది తమ జీవితంలో కూడా సంభవించాలని ప్రతి పత్రికా రచయిత కోరుకోవాలి. తెలుగు సాహితీ వైభవాన్ని పరిశీలించే అవకాశం కూడా జీఎస్‌కు వచ్చింది. ఆ అనుభవాలు కూడా చక్కగా రాశారు. అలాగే రాసిన వార్తకు రమణీయమైన శీర్షిక పెట్టడం పత్రికా రచయిత ప్రతిభను, సృజనను వెల్లడిస్తుంది. ఈ అంశాన్ని కూడా జీఎస్ చర్చించారు. అనుభవజ్ఞుడైన ఒక పత్రికా రచయిత జీవిత చరిత్ర భావి పత్రికా రచయితలకు దివిటీ వంటిదే. అలాంటి పత్రికా రచయిత చుట్టూ ఉండే విషయాలు సామాన్య పాఠకులను కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఈ ‘జ్ఞాపకాల వరద’ చదవవలసిన పుస్తకమే. జ్ఞాపకాల వరద, డా. జి.యస్. వరదాచారి, ఎమెస్కో ప్రచురణ. పేజీలు 272, వెల రూ. 150/– నేటి ఉదయం 10గంలకు హైదరాబాద్‌లో (సోమాజీగూడ ప్రెస్‌క్లబ్) ‘జ్ఞాపకాల వరద’ను ఆవిష్కరిస్తున్న సందర్భంగా.. – గోపరాజు -
‘ఈశాన్యా’నికి ఇక దిక్కెవరు?
కాశ్మీర్‌నూ, ఈశాన్య భారతాన్నీ దాదాపు ఒక్కసారే, ఈ సెప్టెంబర్ మాసంలో వరదలు ముంచెత్తినా ఆ రెండు ప్రాంతాల పట్ల కేంద్రం ప్రదర్శించిన తీరుతో ఈశాన్య భారతవాసులు అలాంటి ప్రశ్న వేసుకోక తప్పని పరిస్థితిని కల్పించాయి. దానితో పాటు ఈ దేశంలో ప్రసార మాధ్యమాలకు కూడా ఈశాన్య భారతమంటే చులకనేనా? ఆరోగ్యానికి అల్లం, అందానికి కాశ్మీర కుంకుమ పువ్వు కావాలి. దేశ రాజధాని ఢిల్లీ కూరగాయల దుకాణాలలో దొరికే అల్లం ఈశాన్య భారతంలో పం డినదే. కానీ ఢిల్లీ పాలకులు కుంకం పూలు విరిసే కాశ్మీరానికి ఇచ్చిన ప్రాధాన్యం అల్లం పండించే ఈశాన్య భారతానికి ఎందుకు ఇవ్వడం లేదు? ‘అల్లం వ్యాపారి నౌకల గురించి తెలుసుకోనక్కర లేదు’ అని అస్సాంలో ఓ సామెత వినిపిస్తుంది. కానీ అలాంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఇప్పుడు ‘సెవెన్ సిస్టర్స్’ ప్రజలు ఆరాటపడుతు న్నారు. కాశ్మీర్‌నూ, ఈశాన్య భారతాన్నీ దాదాపు ఒక్కసారే, ఈ సెప్టెంబర్ మాసంలో వరదలు ముం చెత్తినా ఆ రెండు ప్రాంతాల పట్ల కేంద్రం ప్రదర్శిం చిన తీరుతో ఈశాన్య భారతవాసులు అలాంటి ప్రశ్న వేసుకోక తప్పని పరిస్థితిని కల్పించాయి. దానితో పాటు ఈ దేశంలో ప్రసార మాధ్యమాలకు కూడా ఈశాన్య భారతమంటే చులకనేనా? అక్కడ సంభ వించిన ప్రకృతి విలయం గురించిన వార్తల పట్ల కూడా వివక్షేనా? అన్న ప్రశ్నలు ఉదయించాయి. సెప్టెంబర్ మూడో వారం ఆరంభం నుంచి కొద్దిరోజుల పాటు కుండపోత వర్షాలు, వరదలతో ఈశాన్య భారత రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాం, మేఘాలయ అతలాకుతలమైనాయి. అక్టోబర్ 2 నాటికి తేల్చిన లెక్కల ప్రకారం 70 మంది ఈ విప త్తుకు బలైనారు. మూడు దశలుగా వచ్చిన ఈ వర దలూ వర్షాలకూ మట్టి పెళ్లలు విరిగిపడిన దుర్ఘటన లలోనూ ఒక్క అస్సాంలోనే 42 లక్షల మంది నష్టపో యారు. నాలుగున్నర వేల గ్రామాలు ధ్వంసమైనా యి. 55 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్క మేఘాల యలో 35 మంది చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల లోనూ వంతెనలు, కార్యాలయాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు కారణంగా ఈశాన్య భారతంలో 28 జిల్లాలు దెబ్బతింటే అందులో 23 జిల్లాలు ఒక్క అస్సాంలోనే ఉన్నాయి. రూ.4,350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధి కారులు తేల్చారు. ఈశాన్య భారతంలో ఈ వైపరీత్యానికి నాలు గైదు రోజుల ముందే వరదలూ, వర్షాలతో కాశ్మీర్ కకావికలైంది. 280 మంది చనిపోయినట్టు లెక్కలు అందాయి. ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావంతో 12.50 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రూ. 1,00,000 కోట్లు నష్టం వాటిల్లినట్టు నిర్ధారించారు. విపత్తు సంభవించగానే ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా గుర్తిస్తూ వేయి కోట్ల రూపా యలు తక్షణ సహాయం ప్రకటించారు. తరువాత కూడా అనేక సంస్థలు, మీడియా సంస్థలు కాశ్మీర్ వరద బాధితులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు చేసి, నిధి సేకరణ ఏర్పాట్లు చేశాయి. కానీ ఈశాన్య భారత రాష్ట్రాలలో సంభవించిన వరదలు, జరిగిన నష్టం తక్కువేమీ కాదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకువచ్చారు. ప్రజలు ప్రధాని మోదీ పర్యటించాలని కోరారు. కానీ ఇంతవరకు ఢిల్లీలో సమీక్షా సమావేశాలు నిర్వ హించడం మినహా మోదీ ఈశాన్య భారత పర్య టనకు సిద్ధం కాలేదు. నిజానికి 2014 సంవత్స రంలో సంభవించిన వరదలూ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలలో మొత్తం 179 మంది చనిపో యారు. ఇంతవరకు రూ.887 కోట్లు కేంద్రం మం జూరు చేసింది. ఇందులో రూ.674 కోట్లు ఒక్క అస్సాంకే ఇచ్చారు. ఆ మాటెలా ఉన్నా 2005లో ముంబై నగరం కుండపోతలో చిక్కుకుపోయినపుడు కేంద్రం మంజూరు చేసిన పరిహారం రూ.476 కోట్లు. ఇంతకీ, కాశ్మీర్‌కు తక్షణ సాయం వేయి కోట్లు ప్రకటించడానికి కారణం, ఆగమేఘాల మీద ఆదు కోవడానికి కారణం- ఆ రాష్ట్ర అసెంబ్లీ త్వరలో ఎన్ని కలు జరుపుకోబోతూ ఉండడమేనని, అందుకే మోదీ వెంటనే స్పందించారని ‘షిల్లాంగ్ టైమ్స్’ పత్రిక సంపాదకురాలు పెట్రిషియా ముకీమ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈశాన్య భారతం లోని వేర్పాటువాదం గురించి, రక్తపాతం గురించి దేశంలో మీడియా చూపించే ఆసక్తి ఇక్కడి సాధారణ ప్రజల ఇక్కట్ల పట్ల చూపడం లేదని కూడా ఆమె విమర్శించారు. జాతీయ మీడియా ఇంత చిన్న చూపు చూడడం వల్లనే సరైన సమాచారం బయ టకు రాలేదని చెప్పేవారూ ఉన్నారు. అన్ని ప్రధాన పత్రికలకూ, చానళ్లకూ ఇక్కడ శాఖా కార్యాలయాలు ఉన్నప్పటికీ సరైన నెట్వర్క్ ఏర్పాటులో ఎవరూ శ్రద్ధ తీసుకోవడంలేదని, పార్ట్టైమర్లు ఇచ్చే వీడియో క్లిప్పింగులతోనే కథ నడిపిస్తున్నారని అస్సాం మాజీ ముఖ్యమంత్రి పీకే మహంత ఆరోపించారు. ప్రధాన వార్తాసంస్థలన్నీ, దేశ ప్రధాన స్రవంతి భూభాగా లకు సంబంధించినవి కావడం వల్ల ఈ ప్రాంతం సమస్యలు వాటికి పట్టడం లేదని కూడా కొందరు అస్సాం జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈశాన్య భారతం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం ఇక సాగదని మోదీ ప్రకటిం చడం అందరికీ ఆనందం కలిగించింది. అది ఆచర ణలో చూపడానికి ఇంకా జాప్యం సరికాదు. గోపరాజు -
మమతను వణికిస్తున్న ‘శారద’
శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ప్రాంత ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫొటోను ఉపయోగించుకున్నాడు. ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు. రాజకీయ స్పర్శతో అవినీతి, మోసం, దగా వంటి పదాల అర్థం, లోతు విశేషంగా విస్తరించాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగా ల్‌నూ, అక్కడ రాజ్యమేలుతున్న తృణమూల్ కాంగ్రెస్‌నూ ఎబోలాను మించి వణికిస్తున్న శారదా చిట్‌ఫండ్ కుంభకోణా నికి ఆ మూడు లక్షణాలు ఉన్నాయి. రూపాయి పెట్టుబడికి మూడేళ్లలో రూపాయి లాభం అంటూ ప్రజలను బురిడీ కొట్టించే పొంజి తరహా కుంభకోణమిది. దేశంలోనే అతి పెద్ద పొంజీ మార్కు (పొంజి అనేవాడు అమెరికాలో ఇలాగే మోస గించాడని ఆ పేరే ఖాయం చేశారు) కుంభకోణంగా పేరు మోసిన ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రులు, ఎంపీలు, పోలీసు ఉన్నతాధికారులు, మాజీ నక్సల్, గొప్ప కళాకారులు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. శారదా చిట్‌ఫండ్ తూర్పు భారతంలోనే పెద్ద సంస్థ. పది పత్రికలు, కొన్ని టీవీ చానళ్లు ఉన్నాయంటేనే ఆ సంస్థ విస్తృతి ఎంతో అర్థమవుతుంది. 2006లో ఆరంభమైన ఈ సంస్థ ఏడేళ్ల లోనే రూ. 20,000 కోట్ల వ్యాపారానికి ఎదిగిపోయింది. ఈ మహా సామ్రాజ్యాన్ని నిర్మించినవాడే సుదీప్తసేన్. ఏప్రిల్ 15, 2013న ఈ కుంభకోణం ఉరుములేని పిడు గులా పశ్చిమబెంగాల్ మీద పడింది. తన మూడు సెల్ఫోన్లకు గళ దిగ్బంధనం చేసి, సేన్ పరారీ కావడంతో గగ్గోలు మొద లైంది. అయితే ఏప్రిల్ 23నే ఇతడిని కాశ్మీర్లో అరెస్టు చేయ డంతో అనేక దేవరహస్యాలు పత్రికలకెక్కాయి. పశ్చిమ బెంగా ల్లోని 19 జిల్లాలలో నాలుగు లక్షల మంది మదుపుదారులను సుదీప్త నిలువునా ముంచాడు. ఈ కుంభకోణం మొత్తం రూ.10,000 కోట్లని సీబీఐ తేల్చింది. నిజానికి 1990లో సంచయని సేవింగ్స్ చిట్‌ఫండ్ సంస్థ దివాలా అనుభవం బెంగాల్‌కు ఉంది. సుదీప్త చేసినది తాజా మోసం. శారద చిట్‌ఫండ్ కార్యకలాపాలు ఎలా ఉండేవి? దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఉదంతం చూస్తే చాలు, అంతా అర్థమ వుతుంది. ఇతడు 500 మందిని తన కింద నియమించాడు. వీరంతా 50మంది వంతున ఖాతాదారులను చేర్చారు (మొత్తం 3 లక్షల మంది ఏజెంట్లు). శారద సంస్థ రకరకాల ప్యాకేజీలను జనం ముందుకు తెచ్చింది. ఇంటి స్థలం, ఇల్లు కొనవచ్చు. వ్యవసాయోత్పత్తులలో పెట్టుబడులు పెట్టొచ్చు. కొంత మదుపు తరువాతైనా ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరిం చిన మొత్తం మీద 14 శాతం వరకు వడ్డీ ఇస్తారు. ఇదీ ప్రచారం. చిత్రంగా పోలీసు అధికారుల భార్యలను ఎక్కువగా ఏజెంట్లుగా నియమించేవారు. బెంగాల్ గ్రామీణ ప్రజలు, చిన్న పట్టణాల ప్రజలు ఎగబడి డబ్బు పెట్టారు. శారదా చిట్‌ఫండ్ దివాలా తీశాక 14 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే సంస్థ మూతపడింది. ఇంతకీ సుదీప్త ఎవరు? 1970ల నాటి నక్సల్ ఉద్యమంలోకి ఆవేశంగా వెళ్లిన శంక రాదిత్య సేన్, పదేళ్ల తరువాత హఠాత్తుగా ప్లాట్ల వ్యాపారిగా అవతరించాడు. కొద్దికాలం తరువాత అతడే సుదీప్తసేన్ పేరుతో శారదా చిట్‌ఫండ్‌ను నెలకొల్పాడు. సుదీప్తతో మాట్లా డిన వారు, చూసిన వారు తక్కువ. తన మీడియా విభాగం సీఈఓ కునాల్ ఘోష్‌ను కూడా సుదీప్త సమావేశానికి అనుమ తించేవాడు కాదు. ఆ పత్రికల సంపాదకురాలు ప్రఖ్యాత నటి అపర్ణా సేన్. ఆమె తన కార్యాలయాన్ని మూడున్నర కోట్లతో ఆధునీకరించిన సంగతి మీద ఇప్పుడు సీబీఐకి వివరణ ఇచ్చారు. కునాల్ తృణమూల్ తరఫున రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. సుదీప్తకు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాం తంలో ఐదు ఇళ్లు ఉన్నాయని వెల్లడైంది. అతడికి ముగ్గురు భార్యలని సాక్షాత్తూ మమతా బెనర్జీ నిరుడు ఏప్రిల్ 13న ప్రక టించడం విశేషం. ఇప్పుడు సుదీప్త విజృంభణకు మీరంటే మీరే కారణమని సీపీఎం, తృణమూల్ ఆరోపించుకుంటున్నాయి. కానీ తనకూ, తృణమూల్కూ ఉన్న బంధం ఎలాంటిదో సీబీఐకి రాసిన 18 పేజీల లేఖలో సుదీప్త క్షుణ్ణంగా ఆవిష్కరిం చాడు. రూపూ రేఖా లేకపోయినా మమత వేసిన పెయింటిం గుల కొనుగోలుకు కోటీ ఎనభై లక్షల రూపాయలు వెచ్చించానని ఆ కళాహృదయుడు వాపోయాడు. ఆ పార్టీ ఎంపీ సృంజయ్ బోస్ పేరు కూడా లేఖలో రాయడంతో ఇతడిని సీబీఐ ప్రశ్నించింది. ఇతడు అరెస్టయిన కొద్దిసేపటికే 2012లో సుదీప్త, మమత డార్జిలింగ్ దగ్గర సమావేశమైన సంగతిని బయటపెట్టాడు. కాబట్టి ఇప్పుడు మమత ప్రమేయం మీద సీబీఐ దృష్టి సారించింది. కాగా, నటి, టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్. శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫోటోను ఉపయోగించుకున్నాడు. శారద చిట్‌ఫండ్ అంబులెన్స్ సర్వీసులను ఆమె ప్రారంభించినప్పటి ఫోటో అది. ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు. 1990లో బెంగాల్‌ను కుదిపిన సంచయిన అధిపతి భూదేబ్ సేన్, సుదీప్త తండ్రేనన్న అనుమానాలు మరో కొసమెరుపు. గోపరాజు -
చరిత్రకీ ఉంటుంది కొత్త గొంతు
వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే. సంపాదకుడు ఆర్. సోమారెడ్డి. ఈ గ్రంథాన్ని రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసిం హన్ ఆవిష్కరిస్తారు. ఐసీహెచ్ ఆర్ చైర్మన్ వై. సుదర్శనరావు తదితరులు పాల్గొంటారు. చరిత్రను సమగ్రం చేసుకోవడం ఓ నిరంతర ప్రక్రియ. చరిత్రను పునర్ లిఖించుకోవడం, చారిత్రక ఘట్టాలను పునర్ మూల్యాంకన చేసుకోవడం ప్రతి సమాజానికి ఉన్న బాధ్యత. మరణానంతరం ప్రముఖులకి అదనపు కీర్తిని జోడించడం పరిపాటి అని పన్నెండో శతాబ్దానికి చెందిన కల్హణుడు (‘రాజతరంగిణి’ రచయిత) వ్యాఖ్యానిస్తాడు. అంటే ఒక చారిత్రక పురుషుడి మీద వస్త్వాశ్రయ దృష్టితో, సత్యనిష్టతో కూడిన అభిప్రాయానికి రావడానికి సమయం పడుతుందన్నమాట. చారిత్రక ఘట్టాల మీదైనా అంతే. దీనిని పరిహరిస్తే మళ్లీ కొన్ని తరాల వరకు సమగ్ర చరిత్ర అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రారంభించిన కృషి ఇందుకు సంబంధించినదే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకా రంతో చరిత్ర కాంగ్రెస్ వెలువరించిన కొత్త పుస్తకం ‘మధ్య మలి ఆంధ్రప్రదేశ్ (ఔఅఖీఉ కఉఈఐఉగఅఔ ఊఈఏఖఅ ్కఖఅఈఉఏ) క్రీ.శ. 1324-1724’. చరిత్ర కాంగ్రెస్ వెలువరిస్తున్న గ్రంథాల వరసలో ఇది ఐదో సంపుటం. ఓయూ విశ్రాంత ఆచార్యులు ఆర్. సోమారెడ్డి సంపాదకత్వంలో ఈ సంపుటి వెలువడింది. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కనిపించే ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు, విజయనగర చరిత్ర, కుతుబ్‌షాహీల గాథ వంటి వాటి మీద గతంలోనూ గ్రంథాలు వెలువడినాయి. మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, చిలుకూరి నారాయణరావు, మారెమండ రామారావు, సురవరం ప్రతాపరెడ్డి, గులాం యాజ్దాని వంటి ఉద్దండులు వాటిని ఎంతో శ్రమకోర్చి వెలువరించారు. అయినా కొత్త ఆధారాలు వెలుగు చూస్తూ ఉంటాయి. కొత్త దృక్పథాలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి. అందుకే చరిత్రను పునర్ లిఖించుకోవడం మానవాళి ఒక బాధ్యతగా స్వీకరించింది. క్రీస్తుశకం 1324-1724 మధ్య తెలుగు వారి చరిత్రను, అందులోని పరిణామాలను ఈ పుస్తకం ఆవిష్కరించింది. విజయనగర, బహమనీ, గజపతులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాలు వంటి చిన్న రాజ్యాలు ఆయా ప్రాంతాలలో తలెత్తుకుని మనుగడ సాగించిన కాలం అదే. వ్యవసాయం విస్తరించిన కాలం కూడా అదే. పొగాకు, టమాటా, బంగాళాదుంప, మిరప వంటి వాణిజ్య పంటలు తెలుగు ప్రాంతానికి పరిచయమైన కాలమూ అదే. పత్తి, నీలిమందు పంటలతో వాణిజ్యం సాగించిన సమయం కూడా అదే. అంటే వాణిజ్యం, వాణిజ్య పంటల అవసరాన్ని గమనించిన కాలం. బలమైన సంఘాల ద్వారా వణిజులూ, వృత్తికులాలూ తమ ఉనికిని చాటుకున్నాయి. ఒక ప్రాంతా న్నే, అది కూడా రాజధానీ, చుట్టుపక్కల ప్రాంతాలకే అభివృ ద్ధిని పరిమితం చేయకుండా నలుదిక్కులను అభివృద్ధి చేయ డానికి జరిగిన ప్రయత్నం గురించి అధ్యయనం చేయడం ఏ కాలం పాలకులకైనా అవసరమే. కృష్ణదేవరాయలు నాగులా పురంలో సేద్య అవసరాల కోసం పెద్ద చెరువును నిర్మిం చాడు. ఆయన మంత్రి రాయసం కొండమరుసయ్య కొండ వీడు ప్రాంతంలో రెండు చెరువులు తవ్వించాడు. మరొక రాజ ప్రముఖుడు అనంతపురం దగ్గర బుక్కసముద్రంలో తవ్వించాడు. అంటే అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడడమనేది తరువాతే మనలో లోపించిందా? ఆ కాలం ప్రజలకు బయటి ప్రపంచంతో సంపర్కం ఏర్పడి ఇతర సంస్కృతులతో, మతాలతో, భాషలతో పరిచయం కావడంతోపాటు సహిష్ణుతను అలవాటు చేసుకోవడం ఆరంభమైంది. విజయనగర పాలకులు, బహమనీలు కూడా పాలనా వ్యవహారాలలో మతం జోక్యం లేకుండా చూడడం దీని ప్రభావమే కావచ్చు. మతాన్ని వ్యక్తిగత విషయంగానే పరిగణించిన విజయనగర పాలకులు తిరుపతి అభివృద్ధికి చేసిన కృషి ప్రత్యేకమైనది. తిరుపతితోపాటు అహోబిలాన్ని కూడా ఆ పాలకులు పోషించారు. సంస్కృత సాహిత్య సౌరభాలు, తెలుగు భాషా వికాసం, తెలుగు సాహిత్యంలో కొత్త ధోరణుల ఆవిర్భావం, పర్షియన్ సాహిత్య గుబాళింపు ఎలా జరిగిందో ప్రత్యేకంగా వివరించిన వ్యాసాలు ఉన్నాయి. అప్పటి వాస్తు, యక్షగానం వంటి ప్రదర్శన కళల వికాసాన్ని ఇందులో చదువుతాం. ఈ పుస్తకాన్ని చదవడం నిజంగా ఒక అనుభవం. చరిత్ర అధ్యయనం, పరిశోధన పట్ల తెలుగు ప్రాంతంలో సన్నగిల్లిపోతున్న శ్రద్ధ ఈ సంపుటాలతో పునర్వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం. -గోపరాజు