వారణాసి: ప్రధాని మోదీ గుజరాతీ భాషలో రాసిన కవితా సంపుటి సంస్కృత అనువాదాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆదివారం యూపీలోని బెనారస్ హిందూ వర్సిటీలో ఆవిష్కరించారు. ప్రముఖ అనువాదకురాలు రాజలక్ష్మి శ్రీనివాసన్ ఈ కవితలను సంస్కృతం, తమిళం భాషల్లోకి అనువదించారు.
సంస్కృతంలో ‘నయనం ఇదం ధన్యం’ పేరుతో కవితా సంపుటిని విడుదల చేశారు. ఈ కవితలు మన గ్రామాలు, రైతులు, జవాన్ల గురించి మోదీ సున్నిత భావాలను వివరిస్తాయని జవదేకర్ అన్నారు. హిందీ, తమిళం, ఇంగ్లిష్ భాషల్లోకి కవితలు అనువాదమయ్యాయి.
సంస్కృతంలో మోదీ కవితా సంపుటి
Published Mon, Nov 21 2016 7:57 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
Advertisement
Advertisement