మాజీ క్రికెటర్‌ అంటే ప్రేమ? | Jayalalithaa told to have crush on fromer indian cricketer | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్‌ అంటే ప్రేమ?

Published Tue, Dec 6 2016 8:04 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

మాజీ క్రికెటర్‌ అంటే ప్రేమ? - Sakshi

మాజీ క్రికెటర్‌ అంటే ప్రేమ?

చాలా కాలం పాటు ఇటు సినిమాల ద్వారా, అటు రాజకీయాల ద్వారా ప్రజా జీవితానికి దగ్గరగా గడిపిన జయలలిత గురించి ఎవరికీ తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి...
 
  • తమిళ సినిమాల్లో గొప్ప తారగా వెలిగిపోయారు గానీ, చిన్నతనంలో ఆమెకు భారత జట్టులోని మాజీ క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ అంటే ఆమెకు చాలా ఇష్టం ఉండేది. ఆయన్ను చూడటానికే కొన్ని టెస్టు మ్యాచ్‌లకు కూడా జయ వెళ్లారు.
  • బాలీవుడ్‌లో అలనాటి స్టైలిష్ హీరో  షమ్మి కపూర్ అన్నా కూడా ఆమెకు చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన నటించిన జంగ్లీ సినిమాలోని 'చాహే కోయీ ముఝే జంగ్లీ కహే' పాట అంటే చెవి కోసుకునేవారు.
  • రాజకీయాల్లోకి రావాలని జయలలిత అసలెప్పుడూ భావించలేదు. నిజానికి లాయర్ అవ్వాలనుకున్నారు గానీ అది జరగలేదు. 
  • తన పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లి అత్యంత వైభవంగా చేసినందుకు ఆమె గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. తొలిసారి 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు చేసిన ఈ పెళ్లికి లక్షన్నర మంది అతిథులను ఆహ్వానించారు, చెన్నైలోని 50 ఎకరాల సువిశాల స్థలంలో పెళ్లి చేశారు. 
  • జయలలిత పుస్తకాల పురుగు. రాజకీయాల్లో మునిగి తేలుతూ ఎంత బిజీగా ఉన్నా కూడా పుస్తకాలు చదివేవారు, ప్రయాణాల్లో కూడా తన వెంట పుస్తకాలు తీసుకెళ్లేవారు. 
  • బాలీవుడ్‌లో కూడా జయలలిత కొన్ని సినిమాలు చేశారు. తమిళ సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ అయిన తర్వాత ధర్మేంద్రతో కలిసి ఇజ్జత్ సినిమాలో నటించారు. 
  • తాను నగలు ధరించబోనని 1997లో జయలలిత ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి ఇక ఎలాంటి నగలు ధరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement