
జార్ఖండ్: అంచనాలకు మించి దూసుకెళ్తున్న బీజేపీ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి విజయపథంలో దూసుకెళ్తోంది. ఇంతకాలం అక్కడ అధికారంలో ఉన్న జేఎంఎం - కాంగ్రెస్ కూటమిని చావుదెబ్బ కొట్టి మరీ ముందడుగు వేస్తోంది. అక్కడ మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో కడపటి వార్తలు అందేసరికి 65 స్థానాల్లో ఆధిక్యాలు వెల్లడయ్యాయి.
అందులో 44 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. జేఎంఎం కేవలం 12 స్థానలకు పరిమితం కాగా.. కాంగ్రెస్ మరీ దారుణంగా 5 చోట్ల మాత్రమే ముందంజలో ఉంది. ఇక జేవేఎం, ఇతరులు మరో రెండేసి చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 81 స్థానాలకు గాను 52 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఏబీపీ నీల్సన్, 41-49 వస్తాయని ఇండియాటుడే అంచనా వేశాయి.