న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ప్రస్తుత సంక్షోభంపై వ్యాఖ్యానించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించారు. జనవరి 12న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మీడియా ముందు ఆరోపణలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ ఒకరు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. జస్టిస్ చలమేశ్వర్ సోమవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు సుప్రీంకోర్టు సంక్షోభంపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా, ముకుళిత హస్తాలతో ‘నో కామెంట్స్’ అంటూ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment