No comment
-
సంక్షోభంపై జస్టిస్ చలమేశ్వర్ ‘నో కామెంట్స్’!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ప్రస్తుత సంక్షోభంపై వ్యాఖ్యానించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించారు. జనవరి 12న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మీడియా ముందు ఆరోపణలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ ఒకరు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. జస్టిస్ చలమేశ్వర్ సోమవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు సుప్రీంకోర్టు సంక్షోభంపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా, ముకుళిత హస్తాలతో ‘నో కామెంట్స్’ అంటూ వెళ్లిపోయారు. -
పొలిటికల్ ఎంట్రీపై రజనీ సతీమణి నో కామెంట్
-
‘దాణా’పై నో కామెంట్: లాలూ
పట్నా: దాణా కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాట్లాడేందుకు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిరాకరించారు. దీనిపై తన తరపున లాయర్లు సమాధానం ఇస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసులను వేర్వేరుగా విచారణ జరపాలని సుప్రీం రెండురోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో మొత్తం 64కేసులు నమోదు అవ్వగా, లాలూ మీద 6 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసులో ఆయన దోషిగా కొంతకాలం శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. మరో కేసును జార్ఖండ్ కోర్టు కొట్టివేసింది. ఈ నెల 12న ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల మీద ఈసీ నిర్వహించే సమావేశానికి పార్టీ తరపున మనోజ్ ఝా హాజరవుతారని తెలిపారు. -
రజనీ ఎంట్రీపై నో కామెంట్!
టీనగర్: సినీ నటుడు రజనీకాంత్ రాజ కీయాల్లోకి రావడంపై వ్యాఖ్యానించదలచుకోలేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తెలిపారు. చెన్నై, ప్యారిస్ బస్టాండ్ సమీపానగల రాజా అన్నామలై మండ్రంలో గత 2008లో తమిళ ఈలంలో జరుగుతున్నదేమిటి? అనే అంశంపై ఎండీఎంకే తరపున అభిప్రాయవేదిక జరిగింది. ఈ వేదికలో వైగో పాల్గొని ప్రసంగించారు. ఆ సమయం లో నిషేధిత ఎల్టీటీఈ సంస్థకు మద్దతుగా మాట్లాడినట్లు ఆయనపై దేశద్రోహ కేసు నమోదయింది. కేసు విచారణ మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని అదనపు సెషన్సు కోర్టులో జరిగింది. పిటిషనుదారుడైన క్యూ బ్రాంచి మాజీ ఇన్స్పెక్టర్ మణివన్నన్ కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించి వైగో తర పు న్యాయవాది దేవదాస్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మళ్లీ సోమవారం విచారణ జరిగింది. వైగో కోర్టు కు హాజరయ్యారు. ఇన్స్పెక్టర్ వద్ద క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. తర్వాత విచారణను డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేశారు. కోర్టు నుంచి బయటికి వచ్చిన వైగో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ బ్రోకర్లను శ్రీలంకకు పంపి అధ్యక్షుడు రాజపక్సేతో సన్నిహిత సంబంధాలు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. తమిళులకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని కేంద్రం విడనాడాలని కోరారు. ఆ తర్వాత రాజకీయ ప్రవేశంపై వ్యాఖ్యానించమని కొందరు కోరగా ఈ ప్రశ్నకు సమాధా నం ఇవ్వనని అంటూ ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.