పట్నా: దాణా కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాట్లాడేందుకు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిరాకరించారు. దీనిపై తన తరపున లాయర్లు సమాధానం ఇస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసులను వేర్వేరుగా విచారణ జరపాలని సుప్రీం రెండురోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ కుంభకోణంలో మొత్తం 64కేసులు నమోదు అవ్వగా, లాలూ మీద 6 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక కేసులో ఆయన దోషిగా కొంతకాలం శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మరో కేసును జార్ఖండ్ కోర్టు కొట్టివేసింది. ఈ నెల 12న ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల మీద ఈసీ నిర్వహించే సమావేశానికి పార్టీ తరపున మనోజ్ ఝా హాజరవుతారని తెలిపారు.
‘దాణా’పై నో కామెంట్: లాలూ
Published Thu, May 11 2017 8:36 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
Advertisement
Advertisement