
కాశ్మీర్ డీజీపీగా తెలుగు ఐపీఎస్ అధికారి
శ్రీనగర్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ కె.రాజేంద్రకుమార్ సోమవారం జమ్మూ కాశ్మీర్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న అశోక్ ప్రసాద్‌ను నిఘా సంస్థ ప్రత్యేక డెరైక్టర్‌గా నియమించటంతో ఆయన స్థానంలో రాజేంద్రకుమార్ బాధ్యతలు చేపట్టారు.