కాసేపట్లో దత్తాత్రేయ నివాసానికి కేసీఆర్ | KCR goes for lunch at dattatreya house in new delhi | Sakshi
Sakshi News home page

కాసేపట్లో దత్తాత్రేయ నివాసానికి కేసీఆర్

Published Thu, Sep 22 2016 12:32 PM | Last Updated on Mon, Aug 20 2018 8:47 PM

KCR goes for lunch at dattatreya house in new delhi

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నివాసానికి చేరుకోనున్నారు. కేసీఆర్ను మధ్యాహ్నం విందుకు దత్తాత్రేయ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. విందు సందర్భంగా కేసీఆర్... బండారు దత్తాత్రేయ మధ్య అపెక్స్ కౌన్సిల్ సమావేశ వివరాలతోపాటు... తెలంగాణ రాష్ట్రంలోని పలు పెండింగ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అపెక్స్ కౌన్సిల్లో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ బృందం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement