కేంద్ర హోం మంత్రితో కేసీఆర్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, వినోద్, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు.
రాజ్నాథ్తో కేసీఆర్ పది నిమిషాలు ఏకాంతంగా చర్చించారు. కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురి కేంద్ర మంత్రులను కలిసిన సంగతి తెలిసిందే.