దేశంలో తొలిసారిగా గజరాజులకు ఆస్పత్రి | Kerala to have India's first elephant hospital | Sakshi
Sakshi News home page

దేశంలో తొలిసారిగా గజరాజులకు ఆస్పత్రి

Published Sun, Jun 7 2015 5:00 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

దేశంలో తొలిసారిగా గజరాజులకు ఆస్పత్రి - Sakshi

దేశంలో తొలిసారిగా గజరాజులకు ఆస్పత్రి

త్రిసూర్: దేశంలోనే తొలిసారిగా గజరాజులకు ఓ ఆస్పత్రిని నిర్మించనున్నారు. కేరళకు చెందిన ఓ వెటర్నరీ డాక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక మీడియాతో జాకబ్ చీరన్ మాట్లాడుతూ.. ఒకేసారి 10 ఏనుగులకు చికిత్స అందించే విధంగా ఆస్పత్రిని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజులలో ఏనుగుల చికిత్స నిమిత్తం ప్రత్యేకంగా  హాస్పిటల్ అవసరమన్నారు. కేరళలో ఉన్న 500 ఏనుగుల వయసు ఇప్పటికే 50 ఏళ్లు దాటిపోయిందని, వాటి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని జాకబ్ చెప్పారు. జంతువులు రోజురోజుకు తగ్గిపోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

అయితే, కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఆస్పత్రికి 5 ఎకరాల స్థలం కేటాయించారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ.10 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు జాకబ్ వివరించాడు. ఈ ప్రతిపాదిత ఏనుగు ఆసుపత్రిలో అందరు వాటాదారుల సమావేశం జూన్ 15న రాజధాని నగరం తిరువంతపురం లో జరుగుతుందని డాక్టర్ జాకబ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement