అంబానీపై కేజ్రీవాల్ డైరెక్ట్ ఎటాక్
అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ ఎటాక్‌కు దిగారు. కరెంటు చార్జీలు తగ్గకుండా ఉండేందుకు లంచాలిచ్చారంటూ అంబానీపై ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. బీఎస్ఈఎస్ పనితీరు అత్యంత దారుణంగా, వేధించేలా ఉందని మండిపడింది. దీనిపై మాట్లాడేందుకు రావాలని అనిల్ అంబానీని పిలిపించింది.
అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు చెందిన బీఎస్ఈఎస్ ఢిల్లీలోని విద్యుత్ పంపిణీ సంస్థలలో ఒకటి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తానని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అంతకుముందు కూడా బిల్లులు కట్టొద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఇప్పటికీ పెద్దగా విద్యుత్ చార్జీలు తగ్గకపోవడంతో.. దానికి ప్రధాన కారణం అడాగ్ అని ఆయన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.