పొట్టి స్కర్ట్స్, టీ షర్టులు వద్దు... | Kolkata's Scottish Church College prescribes dress code, bans short skirts | Sakshi
Sakshi News home page

పొట్టి స్కర్ట్స్, టీ షర్టులు వద్దు...

Published Mon, Jun 29 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

పొట్టి స్కర్ట్స్, టీ షర్టులు వద్దు...

పొట్టి స్కర్ట్స్, టీ షర్టులు వద్దు...

కోలకతా: కోలకతాలోని ఓ ప్రముఖ కళాశాల యాజమాన్యం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. తమని కనీసం  సంప్రదించకుండా ఇలాంటి నిబంధనలు  తగవంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే... కోలకత్తాలోని  స్కాటిష్  చర్చ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు డ్రెస్కోడ్  విధిస్తూ నోటీసులు జారీ చేసింది.

అబ్బాయిలు రౌండ్ నెక్ టీ షర్టులు,   కాప్షన్స్, పిచ్చిరాతలు ఉన్న టాప్స్,  అమ్మాయిలు పొట్టి గౌనులు ధరించి కాలేజీకి  రావడాన్ని నిషేధించింది.  విద్యార్థినీ విద్యార్థులు విధిగా పొడుగు చేతుల చొక్కాలు, చీరలు, సల్వార్ కమీజులు మొదలైన దుస్తులు ధరించి కళాశాలకు రావాలని సూచించింది. దీంతోపాటు అబ్బాయిలు చెవులకు రింగులు ధరించడాన్ని కూడా తప్పు బట్టింది.

ఇక కళాశాల యాజమాన్యం నిర్ణయంపై  విద్యార్థి సంఘాలు సోమవారం నుంచి ఆందోళన దిగాయి.  మరోవైపు ఈ  రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి  అనాగరిక నిబంధనలా అంటూ మేధావులు విమర్శిస్తున్నారు.  విద్యార్థుల స్వేచ్ఛా స్వాత్యంత్ర్యాలకు ఇది  తీరని  భంగపాటు అంటూ అనేకమంది విద్యావేత్తలు ,  ఉద్యమకారులు  విరుచుకుపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement