సాక్షి, ముంబై: ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్‌కు ఈ శాసన సభ ఎన్నికల్లో టికెటు లభించే అవకాశాలు లేవు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తనకు కాకుంటే కనీసం తన కొడుకు లేదా కూతురికి ముంబై అసెంబ్లీ టికెటు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఆయనకు టికెటు ఇవ్వాలా..? వద్దా...? అనేది సోనియా గాంధీ చేతిలో ఉంది.
ఒక వేళ ఆమె తలుచుకుంటే సింగ్‌కు లేదా ఆయన కుటుంబంలో ఒకరికి టికెటు (అభ్యర్థిత్వం) ఇచ్చే అవకాశాలున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలి ్గఉన్నాడనే కేసుల్లో నాలుగు సంవత్సరాల నుంచి ఆయన బాంబే కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ ఆరోపణల కారణంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. ఆయన ముంబై రీజియన్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) అధ్యక్ష పదవికి రాజీ నామా చేయాల్సి వచ్చింది. కోర్టు కేసులో తీర్పు వెలువడితే జైలు శిక్ష పడితే ఆయన రాజకీయ జీవితానికే పుల్‌స్టాప్ పడనుంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ ఆయనకు ఎమ్మెల్యేగా టికెటు ఇస్తే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతుందని కాంగ్రెస్ నాయకులు కొందరు భావిస్తున్నారు.
ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సింగ్ తనకు కాకుంటే కనీసం తన కుటుంబ సభ్యులకు అభ్యర్థిత్వం దక్కేలా చూడాలని సోనియా ముందు మోకాళ్లీరుతున్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో కృపాశంకర్ సింగ్ పోటీచేసిన నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని మరో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు.
కానీ, ఈ నియోజక వర్గాన్ని వదిలేందుకు సింగ్ సిద్ధంగా లేరు. ఒకవేళ ఢిల్లీ అధిష్టానం సింగ్‌కు లేదా ఆయ న కుటుంభీకులకు టికెటు ఇస్తే ఆ నియోజకవర్గం చేజారిపోవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. సింగ్‌తోపాటు ఆయన కుటుబీబికులకెవరికీ టికెటు ఇవ్వకూండా సిని యర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.