అయ్యో పాపం.. లాయర్ కుటుంబాన్ని దోచేశారు! | Lawyer family robbed of car, cash on highway in UP | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం.. లాయర్ కుటుంబాన్ని దోచేశారు!

Published Sun, May 22 2016 12:03 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

అయ్యో పాపం.. లాయర్ కుటుంబాన్ని దోచేశారు!

అయ్యో పాపం.. లాయర్ కుటుంబాన్ని దోచేశారు!

ముజఫర్ నగర్: పట్టపగలే దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. లాయర్ కుటుంబాన్ని నిలువుదోపిడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మథురకు చెందిన లాయర్ మన్మోహన్ శర్మ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై వెళ్తుండగా నలుగురు గుర్తుతెలియని దుండగులు వారి కారును అడ్డగించారు. ఈ విషయాలపై మండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మథుర నుంచి హరిద్వార్ కు వెళ్తుండగా అడ్డగించారని, అనంతరం తమ వద్ద ఉన్న నగదు, బంగారం, విలువైన అన్ని వస్తువులను దోచుకున్నారని తన ఫిర్యాదులో లాయర్ శర్మ పేర్కొన్నారు. చివరికి కారు కూడా తమకు దక్కకుండా చేసి, అందులో పరారయ్యారని తెలిపారు. వర్మఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సంతోష్ కుమార్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement