
లష్కరే తోయిబా కమాండర్ హతం
శ్రీనగర్:
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఆయుబ్ లెల్‌హరిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా జిల్లాలోని బందెర్పోరాలోని కాక్‌పొరా గ్రామంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుకు గాయాలయ్యాయి.
'మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా ఆయుబ్ లెల్‌హరి ఉన్నాడు. ఇది భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయం' అని జమ్ము కశ్మీర్ డీజీపీ తెలిపారు.