
లష్కరే టాప్ కమాండర్ హతం
జమ్ము: లష్కర్ ఏ తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబూ బకర్ హతమయ్యాడు. భారత సైనికుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది చనిపోయాడు. సోపోర్‌లో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
గత కొన్ని గంటలుగా జమ్ముకశ్మీర్ లోని సొపోర్ ప్రాంతంలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లోనే ఉగ్రవాది అబూ బకర్ హతమయ్యాడని తెలుస్తోంది. భారతీయ సైనికులకు ఎలాంటి హానీ జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.