LeT commander
-
26/11 కుట్రదారుడు సాజిద్ మీర్‌పై విష ప్రయోగం!
ఇస్లామాబాద్: ఒకవైపు వరుసగా జరుగుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) కమాండర్ల మరణాలు అంతచిక్కని మిస్టరీగా మారాయి. మరోవైపు తాజాగా మరో ఎల్ఈటీ కమాండర్ సాజిద్ మీర్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సాజీద్ మీర్.. కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పైన ఉన్న సాజిద్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అతనికి గత ఏడాది జూన్‌లో శిక్ష విధించగా.. ప్రస్తుతం లఖ్‌పత్ జైల్లో ఖైదీగా ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలకు ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో మరో జైలుకు బదిలీ చేసే సమయంలో ఆస్పత్రి పాలు కావటం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. BIG BREAKING: Bharat's Most Wanted Lashkar-e-Taiba terrorist, the main conspirator in the 26/11 Mumbai attacks, Sajid Mir, poisoned by 'UNKNOWN MEN' inside Central Jail Dera Ghazi Khan in Pakistan.Sajid is in critical condition and on a ventilator support; air-lifted by Pak… pic.twitter.com/efICEzadhs— Treeni (@_treeni) December 4, 2023 భారత్‌లో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల కుట్రదారుల్లో ఒకడైన సాజిద్ మీర్ గత ఏడాది అరెస్టయ్యాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగం రుజువు కావడంతో 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. సాజిద్ మీర్‌ను తమకు అప్పగించాలని అమెరికా.. గత కొంతకాలంగా పాక్‌పై ఒత్తిడి తెస్తోంది. అమెరికాకు అప్పగించడం ఇష్టం లేని ISI.. సాజిద్‌పై విషప్రయోగం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సాజిద్ తలకు అమెరికా FBI 5 మిలియన్ డాలర్ల వెల కట్టింది. 26/11 మంబై ఉగ్రవాద దాడి కుట్రదారుల్లో ఒకడైన సాజిద్.. ఉగ్రవాదులు ముంబై చేరడానికి తెర వెనక కావాల్సిన సాయం చేశాడు. ఇది కూడా చదవండి: బ్రిటన్ వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. -
టాప్ ఎల్ఈటీ కమాండర్ ఖతం!
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాదళాలకు మరో విజయం. పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ వసీం షాను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో వసీం షా సహా అతని అనుచరుడైన మరో ఉగ్రవాది నజీర్ అహ్మద్ మృతి చెందారు. వసీం షా లష్కరే తోయిబా షోపియన్ జిల్లా కమాండర్‌గా కొనసాగుతున్నాడు. అతన్ని మట్టుబెట్టిన భద్రతా దళాలను జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ప్రశంసించారు. 'క్లీన్ ఆపరేషన్‌లో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. వెల్డన్ జేకేపీ (జమ్మూకశ్మీర్ పోలీస్) బాయ్స్, సెక్యూరిటీ ఫోర్సెస్' అని వైద్ ట్వీట్ చేశారు. దక్షిణ పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు, పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. శనివారం ఉదయమే ఈ గ్రామాన్ని చుట్టుముట్టి.. ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. -
లష్కరే తోయిబా కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఆయుబ్ లెల్హరిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా జిల్లాలోని బందెర్పోరాలోని కాక్‌పొరా గ్రామంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ జవానుకు గాయాలయ్యాయి. 'మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా ఆయుబ్ లెల్హరి ఉన్నాడు. ఇది భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయం' అని జమ్ము కశ్మీర్ డీజీపీ తెలిపారు. -
ఎల్ఈటీ టాప్ కమాండర్ ఖతం!
శ్రీనగర్: కశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అబు దుజనా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు తెలుస్తోంది. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో అబు (27)తోపాటు మరో మిలిటెంట్ చనిపోయాడని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. పుల్వామాలోని హక్రిపోరా గ్రామంలో మిలిటెంట్లుకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా తాము స్వాధీనం చేసుకోలేదని, కాబట్టి ఎవరు చనిపోయింది ఇప్పుడే చెప్పలేమని కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ విలేకరులకు తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి చెందిన అబు దుజనా దక్షిణ కశ్మీర్లో జరిగిన చాలా మిలిటెంట్ దాడుల వెనక ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. -
లష్కరే టాప్ కమాండర్ హతం
జమ్ము: లష్కర్ ఏ తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబూ బకర్ హతమయ్యాడు. భారత సైనికుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది చనిపోయాడు. సోపోర్‌లో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. గత కొన్ని గంటలుగా జమ్ముకశ్మీర్ లోని సొపోర్ ప్రాంతంలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లోనే ఉగ్రవాది అబూ బకర్ హతమయ్యాడని తెలుస్తోంది. భారతీయ సైనికులకు ఎలాంటి హానీ జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.