వారం రోజుల్లో నివేదిక సమర్పించండి | LG baijal orders ACB to submit report on Kejriwal bribe allegations in week | Sakshi

వారం రోజుల్లో నివేదిక సమర్పించండి

May 8 2017 7:47 PM | Updated on Aug 17 2018 12:56 PM

వారం రోజుల్లో నివేదిక సమర్పించండి - Sakshi

వారం రోజుల్లో నివేదిక సమర్పించండి

ఆప్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా సమర్పించిన ఫిర్యాదును లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ సోమవారం ఏసీబీకి పంపారు.

- కేజ్రీవాల్‌ ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఎల్జీ అదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా సమర్పించిన ఫిర్యాదును లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ సోమవారం ఏసీబీకి పంపారు. ఏసీబీ ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి వారంరోజుల్లో నివేదిక సమర్పించాలని బైజల్‌ ఆదేశించారు. ఏసీబి ఛీప్‌ మీనా సోమవారం ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ను కలిశారు.

కపిల్‌ మిశ్రా ఆదివారం సాయంత్రం ఎల్జీని కలిసి కేజ్రీవాల్‌ సర్కారు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా, ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సాలతో పాటు బీజేపీ ప్రతినిధి బృందం సోమవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసి కపిల్‌ మిశ్రా ఆరోపణలపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement