న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ చట్టంలోని మొత్తం 9 సవరణలకు లోక్ సభలో ఆమోద ముద్ర పడింది. అయితే దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేడీ సభ నుంచి వాకౌట్ చేశాయి. భూసేకరణ చట్టంలపై ప్రతిపక్షాలు చేసిన సవరణలు వీగిపోయాయి.
ఇదిలా ఉండగా భూసేకరణ బిల్లుకు అన్నా డీఎంకే ఆమోదం తెలిపింది. కాగా బిల్లుపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన సభలో లేకపోవడం గమనార్హం. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత లోక్ సభ బుధవారానికి వాయిదా పడింది.