న్యూఢిల్లీ: ‘లవ్ జిహాద్’ అనే మాటకు ప్రస్తుత చట్టాల్లో ఎటువంటి నిర్వచనం లేదని, కేంద్ర సంస్థలేవీ లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసులను విచారణ చేయడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లవ్ జిహాద్ కేసులకు సంబంధించి కేరళ కాంగ్రెస్ నాయకుడు బెన్నీ బెహనా అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత రెండేళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దక్షిణాదిలో లవ్ జిహాద్ కేసులు నమోదు చేశాయా అని బెన్నీ బెహనా అడిగారు.
అదేవిధంగా, ఎన్నార్సీ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మంగళవారం ఎయిర్‌క్రాఫ్ట్ చట్ట ఉల్లంఘనుల నుంచి భారీ జరిమానా వసూలు చేయడం సహా పలు ప్రతిపాదనలతో ఎయిర్‌క్రాఫ్ట్ చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.1కోటికి ప్రభుత్వం పెంచింది. (చదవండి: అందుకేనా మా నాన్న ఉగ్రవాది...?)
Comments
Please login to add a commentAdd a comment