మా పనితీరుకు అది నిదర్శనం | Lucknow-Agra expressway symbol of our work | Sakshi
Sakshi News home page

మా పనితీరుకు అది నిదర్శనం

Published Wed, Oct 25 2017 1:45 PM | Last Updated on Wed, Oct 25 2017 1:48 PM

Lucknow-Agra expressway symbol of our work

సాక్షి, లక్నో: లక్నో-ఆగ్రా హైవేపై మంగళవారం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విన్యాసాలపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ట్విటర్‌లో స్పందించారు.  హైవేపై భారతీయ వాయు సేన చేసిన విన్యాసాలను ఆయన ప్రశంసించారు. రాజకీయాలకతీతంగా అదంరూ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ను అభింనందించాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో లక్నో-ఆగ్రా నేషనల్‌ హైవే.. జాతీయ ఆస్తిగా ఆయన పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్న ఆగ్రా-లక్నో జాతీయ రహదారిని తన హయాంలో అత్యంత పటిష్టంగా నిర్మాణం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ జాతీయ రహదారే నా పనితనానికి నిదర్శనం అని అన్నారు.  ఉత్తర్‌ప్రదేశ్‌ మౌలిక వసతులు నేడు దేశానికి శ్రేయస్సులు, రక్షణను కలిగించే స్థాయికి చేరినందుకు గర్వంగా ఉందని అఖిలేష్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement