ముంబై: స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను, వాహనాలను కేటాయించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంబులెన్స్‌ల కొరత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రైవేటు అంబులెన్స్ రేటును ఆసుపత్రికి ఉన్న దూరాన్ని, నిర్థిష్ట వాహనాన్ని బట్టి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇవి 24/7 అందుబాటులో ఉంటాయి. వీటి కొనుగోలు బాధ్యతను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. (భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు)
ఒకవేళ ఈ వాహనాల డైవర్లు అందుబాటులో లేకపోతే మున్సిపల్ కార్పోరేషన్, పంచాయతీవారు డ్రైవర్లను ఏర్పాటు చేసి ఇంధన వ్యయాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. ప్రతి ప్రైవేట్ అంబులెన్స్‌లో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. ఇది రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్ 108తో అనుసంధానించబడుతుంది. కాబట్టి ప్రైవేట్ అంబులెన్స్‌లకు సంబంధించిన కీలక ఫిర్యాదులను కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్ అధికారులు పరిశీలిస్తుంటారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 76,000 పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, కోలుకున్న వారు 52.2 శాతం ఉన్నారు. ఇక కరోనా బారిన పడుతున్న వారు 18.7 శాతం ఉండగా, మరణాల రేటు 4.49 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (కోలుకున్నవారు..కోవిడ్‌పై వార్)
Comments
Please login to add a commentAdd a comment