Private ambulances
-
అంబులెన్స్ దోపిడీ
-
కరోనా: మహారాష్ట్ర మరో ముందడుగు
ముంబై: స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను, వాహనాలను కేటాయించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంబులెన్స్‌ల కొరత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రైవేటు అంబులెన్స్ రేటును ఆసుపత్రికి ఉన్న దూరాన్ని, నిర్థిష్ట వాహనాన్ని బట్టి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇవి 24/7 అందుబాటులో ఉంటాయి. వీటి కొనుగోలు బాధ్యతను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. (భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు) ఒకవేళ ఈ వాహనాల డైవర్లు అందుబాటులో లేకపోతే మున్సిపల్ కార్పోరేషన్, పంచాయతీవారు డ్రైవర్లను ఏర్పాటు చేసి ఇంధన వ్యయాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. ప్రతి ప్రైవేట్ అంబులెన్స్‌లో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. ఇది రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్ 108తో అనుసంధానించబడుతుంది. కాబట్టి ప్రైవేట్ అంబులెన్స్‌లకు సంబంధించిన కీలక ఫిర్యాదులను కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్ అధికారులు పరిశీలిస్తుంటారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 76,000 పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, కోలుకున్న వారు 52.2 శాతం ఉన్నారు. ఇక కరోనా బారిన పడుతున్న వారు 18.7 శాతం ఉండగా, మరణాల రేటు 4.49 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (కోలుకున్నవారు..కోవిడ్‌పై వార్) -
ఆ అంబులెన్స్‌లు కదలవు..
►కమీషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్స్‌లు ►గర్భిణీ రెఫర్ కేసులు 108 వాహనాల్లో తరలింపు ►అత్యవసర కేసులకు వెళ్లలేకపోతున్న 108 ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో దళారుల రాజ్యం నడుస్తోంది. వారి ధన దాహానికి పేదలు బలవుతున్నారు. ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రోత్సహిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. అత్యవసర సమయంలో ప్రభుత్వ ఖర్చులతోనే మెరుగైన చికిత్స కోసం కడప, ఇతర ప్రాంతాలకు పేద రోగులను తరలించాల్సి ఉంది. బాధితులే ఖర్చులు భరించగా గతంలో కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు అంబులెన్స్‌లను పంపించేవారు. అయితే కొన్నినెలల నుంచి తిరుపతి, కర్నూలుకు అనుమతించడం లేదు. కేవలం కడప వరకు మాత్రమే బాధితులు డీజల్ ఖర్చులు భరించి ఆస్పత్రిలోని ప్రభుత్వ అంబులెన్స్‌లను తీసుకొని వెళ్తున్నారు. కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు అంబులెన్స్‌లను పంపడం లేదని కొందరు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇటీవల ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి సలహామండలి సమావేశానికి వచ్చిన కలెక్టర్ కర్నూలు, తిరుపతికి కూడా అంబులెన్స్‌లను అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఎందుకో మరి అధికారులు కలెక్టర్ ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదు. దీంతో అత్యవసర సమయంలో బాధితులు ప్రైవేట్ వాహనాల్లో రూ.వేలు ఖర్చు చేసుకొని ఇతర ప్రాంతాల ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు దళారుల పాత్ర పోషించి ప్రైవేట్ వాహనాలను ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడప రిమ్స్‌కూ వెళ్లని అంబులెన్స్‌లు నిబంధనల ప్రకారం అత్యవసర సమయంలో బాధితులను ఆస్పత్రి ఖర్చులతోనే అంబులెన్స్‌ల్లో కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్లాల్సి ఉంది. అయితే ఎన్నడూ ఆస్పత్రి నిధులను వెచ్చించిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం నుంచి 108 వాహనాల్లో గర్భిణీలను కడప రిమ్స్‌కు తీసుకొని వెళ్లొచ్చనే ఆదేశాలు వచ్చాయి. 108 వాహనం ఇక్కడి నుంచి ఖాజీపేట వరకు వెళ్తే అక్కడి నుంచి ఖాజీపేట ప్రాంతానికి చెందిన వాహనంలో కడపకు వెళ్లేలా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రికి చెందిన ప్రతి గర్భిణీ కేసు 108 వాహనంలోనే కడపకు తీసుకొని వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ 24గంటలు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలి. కానీ రాత్రి సమయాల్లో మాత్రం చాలామంది డాక్టర్లు ఆస్పత్రిలో ఉండటం లేదని సిబ్బంది అంటున్నారు. అత్యవసర కేసు ఆస్పత్రికి వచ్చినప్పుడు డాక్టర్ ఆస్పత్రికి రాకుండానే కడపకు రెఫర్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అత్యవసర కేసులకు వెళ్లలేకపోతున్నాం.. జిల్లా ఆస్పత్రి నుంచి ఖాజీపేట వరకు 108 వాహనం వెళ్లి రావాలంటే సుమారు 2 గంటలు పడుతుంది. ఈ రెండు గంటల్లో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల నుంచి కనీసం రెండు అత్యవసర కేసుల ఫోన్లు వస్తాయని 108 సిబ్బంది చెబుతున్నారు. కడప రిమ్స్‌కు వెళ్లడం వల్ల ముఖ్యమైన కేసులకు వెళ్లలేకపోతున్నామని వా రు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్‌లు ఉన్ననూ తమకే ఆస్పత్రి సిబ్బంది ఫోన్లు చేస్తున్నారని వారు చెబుతున్నారు. -
అందినకాడికి దండుకోవడమే..
పింప్రి, న్యూస్‌లైన్ : అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల్లోనూ దండుకొంటున్నారు. రోగుల నుండి అత్యధికంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఫిట్‌నెస్‌లేని వాహనాలను వినియోగిస్తున్నా రు. కొన్ని అంబులెన్సుల్లో కనీస సౌకర్యాలు లేవు. సామాజిక, రాజకీయ పార్టీలనుండి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేసి అంబులెన్స్ ప్రారంభిస్తున్న వారి ఆగడాలను అరికట్టే దిక్కులేకుండా పోయింది. ఇష్టమొచ్చినట్లు రోగుల బంధువుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న రోగులు, బంధువులుకూ ఇబ్బం దులు తప్పడం లేదు. తనిఖీలు నిల్ ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల అంబులెన్సులల్లో వైద్య సదుపాయాలను ఆయా ఆస్పత్రిలే తనిఖీల ను చేస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్న అం బులెన్సులను ఎవరూ తనిఖీ చేయడం లేదు. ఒక్కో అంబులెన్సులో ఒక్కో ధరను వసూలు చేస్తున్నా యి. పుణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న అంబులెన్సులను పరిశీలిస్తే.. సంస్థల ద్వారా 288 అంబులెన్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా- 326, కేంద్ర ప్రభుత్వం ద్వారా-11, శిక్షణ సంస్థల ద్వారా-8, స్వయం సేవా సంస్థల ద్వారా 110, స్థానిక సంస్థల ద్వారా-32, ఇతరులు-2 మొత్తం నగరంలో 1351 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. సౌకర్యాలు ఉండేవి..ఉండనివి.. అంబులెన్సులు రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటిది బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వీటిలో ప్రత్యేక సదుపాయాలు ఉండవు. ఇవి కేవలం రోగులను తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. రెండో రకం అంబులెన్సులల్లో సిలిండర్ , స్ట్రెక్చర్, ఈసీజీ మిషన్, సిరంజ్‌పంప్, డెఫ్రి బ్రిలేటర్ (హృదయ సంబంధించిన యం త్రం) బ్లడ్ ప్రెషర్ మిషన్, వెంటి లేటర్ సెక్షన్ మిషన్, నెబులైజర్, మాస్కులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, నర్సు, డాక్టర్లు, టెక్నీషియన్ ఉంటారని ససూన్ ఆస్పత్రి వైద్య పర్యవేక్షులు డాక్టర్ డి.బి.కులకర్ణి పేర్కొన్నారు. ఆర్టీవో పరిశీలనకు దూరం ఆర్టీవో ద్వారా అంబులెన్సుల వాహనంలో అన్ని మిషన్ విడిభాగాలను పరిశీలిస్తారు. భద్రతా పరం గా ఈ వాహ నం ఫిట్నెస్ను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆర్టీవో జారీ చేస్తుంది. ఇలా ప్రతి ఏడాది పరిశీ లి స్తోంది. ఇందుకు ప్రతి అంబులెన్స్ నుండి రూ.300 రుసుం వసూలు ఆర్టీవో అధికారులు వసూలు చేస్తా రు. ప్రస్తుతం నగరంలో సేవలందిస్తున్న 1,351 అంబులెన్సులకు 561 అంబులెన్సు లు ఆర్టీవో వద్ద తనిఖీలు జరపనే లేదు. 2012 తర్వాత ఒక్కసారి కూడా వీటిని పరిశీలించిన దాఖ లాలు లేవు. అంబులెన్సుల పనితీరును పరిశీలించడం తమ పని కాదని పుణే కార్పొరేషన్ ఆరోగ్య విభాగాధికారి డాక్టర్ ఎస్.టి.పరదేశీ తెలిపారు. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి : ఆర్టీవో ఈ విషయమై ఆర్టీవో అధికారి జితేంద్ర పాటిల్ మాట్లాడుతూ..ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోం, స్వయం సేవా సంస్థల ద్వారా మొత్తం 1,351 అంబులెన్సులు నడుస్తున్నాయన్నా రు. ఇందులో 790 అంబులెన్సులు ఫిట్నెస్ పరీక్ష లు చేయించుకున్నాయని, కొత్త అంబులెన్సులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి, పాత అంబులెన్సులను ప్రతి సంవత్సరం తప్పక పరిశీలించాల్సి ఉందన్నారు. ఫిట్నెస్ పరీక్షలు తప్పకుండా జరుపుకోవాలని, లేకుంటే ఆ వాహనాన్ని అన్ ఫిట్ వాహనాలుగా ప్రకటిస్తామని తెలిపారు.