
కేంద్రం కక్షగట్టింది: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని వ్యతిరేకించినందుకుగాను కేంద్రం తనపై కక్షగట్టిందని ఆరోపించారు. అందుకే.. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సుధీప్ బందోపాధ్యాయను సీబీఐ వేధిస్తోందని మమత ఆరోపించారు.
ఈ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమతకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐను అడ్డం పెట్టుకొని వేధించడం సరికాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దును వ్యతిరేకించినందుకు పశ్చిమబెంగాల్ టార్గెట్‌గా మారిందన్నారు.