పేద యువతులకు మమత పెళ్లి కానుక | Mamata Govt Rupashree Scheme Assistance For Poor Women Marriages | Sakshi
Sakshi News home page

పేద యువతులకు మమత పెళ్లి కానుక

Published Sun, Apr 1 2018 2:31 PM | Last Updated on Sun, Apr 1 2018 2:31 PM

Mamata Govt Rupashree Scheme Assistance For Poor Women Marriages - Sakshi

సాక్షి, కోల్‌కతా : పేద యువతుల వివాహనికి చేయూత అందించడానికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలికలు చదువుకునేలా, బాల్య వివాహల నిర్మూలనే లక్ష్యంగా బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే కన్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి విశేష స్పందన లభించింది. ఇందులో భాగంగా బాలికలకు సంవత్సరానికి 500 రూపాయల స్కాలర్‌షిప్‌తోపాటు, టెన్త్ పాసయ్యాక ఒకేసారి 25వేల రూపాయలు అందజేస్తున్నారు. ఈ పథకానికి  కొనసాగింపుగా రూపశ్రీ పథకాన్ని గత బుధవారం నుంచి అమల్లోకి తీసుకుచ్చారు.

ఈ పథకం కింద పేద మహిళల వివాహానికి 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారని, ఆర్థికంగా వెనుకబడిన ఆరు లక్షల యువతులకు లబ్ధి జరగనుందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement