చెంపపై కొట్టి... కేజ్రీవాల్ కు క్షమాపణ
చెంపపై కొట్టి... కేజ్రీవాల్ కు క్షమాపణ
Published Wed, Apr 9 2014 3:44 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ను చెంప దెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్ క్షమాపణలు చెప్పారు. నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆటో డ్రైవర్ లాలీ అన్నారు. నేను పెద్ద తప్పే చేశాను. నా జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు. నా దృష్టిలో కేజ్రీవాల్ దేవుడు అని దాడికి పాల్పడిన లాలూ అన్నారు. దక్షిణ ఢిల్లీలోని సుల్తాన్ పురిలో జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ ను దండ వేసి చెంపపై కొట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడిలోకంటికి గాయం కావడంతో కేజ్రీవాల్ ప్రచారం మధ్యలోనే ఆపి వేసి వెళ్లారు. ఆతర్వాత ఆటో డ్రైవర్ ను ఆప్ కార్యకర్తలు చితకబాదారు.
అయితే దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్.. కేజ్రీవాల్ ను క్షమాపణలు కోరారు. కేజ్రీవాల్ ను క్షమించాలంటూ కాళ్లకు వంగి దండం పెట్టడానికి వచ్చిన లాలీని మనీష్ సిసోడియా వారించారు. గత కొద్దికాలంగా కేజ్రీవాల్ ను కలిసేందుకు ప్రయత్నించాను. ఆయనను కలువడానికి జనతా దర్బార్ కు వెళ్లాను అని మీడియాకు తెలిపారు. గత వారం రోజుల్లో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండవసారి.
Advertisement