దేవుడు తప్ప.. నన్నెవరూ చంపలేరు: కేజ్రీవాల్
దేవుడు తప్ప.. నన్నెవరూ చంపలేరు: కేజ్రీవాల్
Published Tue, Apr 8 2014 5:33 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
న్యూఢిల్లీ: నాకు ప్రాణహాని ఉంది అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడి ప్రత్యర్ధుల కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. తనపై దాడి జరిగినా భద్రతా సిబ్బంది ఏర్పాటును అంగీకరించనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
'కుట్రలో భాగంగానే దాడి జరిగింది. నిందితులు అరెస్టైనా మళ్లీ దాడులకు పాల్పడుతారు' అని ఆయన అన్నారు. తనను లక్ష్యంగా చేసుకునే దాడి ఎందుకు జరుగుతోందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఇతర పార్టీలు అభద్రతాభావానికి గురవుతున్నాయని కేజ్రివాల్ విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై మళ్లీ దాడులు జరుగుతాయని, మాలో ఎవరూ చనిపోతారని కూడా కేజ్రీవాల్ అన్నారు.
దాడి జరిగినా సెక్యూరిటీ అక్కర్లేదు.. సెక్యూరిటీ సిబ్బందిని అనుమతించే ప్రసక్తే లేదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేవుడు అనుకుంటే తప్ప నేను చస్తాను. అంతేతప్ప నన్ను ఎవరూ చంపలేరు అని కేజ్రీవాల్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సుల్తాన్ పూరిలో కేజ్రీవాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
Advertisement