Sultanpuri
-
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రోబోల సాయంతో మంటలు అదుపులోకి..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, రోబోల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. కాగా, అగ్నిప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా డివిజన్ అగ్నిమాపక శాఖ అధికారి ఏకే జైస్వాల్ మాట్లాడుతూ.. ప్రమాద స్థలానికి 15 ఫైర్ ఇంజిన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. మంటలను ఆర్పేందుకు రోబోలను కూడా ఉపయోగిస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 15 fire tenders present at the spot. The situation is under control. Robots are also being used to extinguish the fire. No casualties reported so far: AK Jaiswal, Divisional Fire Officer, Delhi pic.twitter.com/pjaBYeLc6Z — ANI (@ANI) March 2, 2023 -
Delhi: దారుణానికి ముందు గొడవ పడ్డ అంజలి, నిధి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అంజలీ సింగ్ అనే యువతిని కారు ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అంజలి స్కూటీపై ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు తేలింది. అయితే, అంతకుముందు వారిద్దరూ డబ్బు విషయమై ఘర్షణకు కూడా దిగినట్లు అంజలి స్నేహితుడొకరు వెల్లడించాడు. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు అనుమానాలున్న అశుతోష్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుమానితుడు అంకుశ్ ఖన్నా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇలా ఉండగా, మృతురాలు అంజలీ సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇదీ చదవండి: అంజలి ఘటనతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. మహిళా కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు -
అంజలి కేసు: ఘటన తర్వాత పక్కా ప్లాన్‌తోనే..
ఢిల్లీ: సుల్తాన్‌పురి హిట్ అండ్ రన్ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెల్లడి అవుతోంది. ఘటన జరిగిన సమయంలో కారు ఉంది ఐదుగురు కాదని, కేవలం నలుగురే ఉన్నారని తాజాగా పోలీసులు ప్రకటించడం ఈ కేసును మలుపు తిప్పింది. అంతేకాదు.. ఈ కేసులో కారు నడిపింది దీపక్ ఖన్నా కాదని గురువారమే సంచలన ప్రకటన చేశారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో కారు నడిపింది తనేనని దీపక్ ఖన్నా అనే వ్యక్తి పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో దీపక్‌తో పాటు కారులో ఉన్నారని చెబుతూ ముందుకొచ్చిన మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, కృషన్, మిథున్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే.. దర్యాప్తులో వీళ్లను తప్పించేందుకు మరో ఇద్దరు యత్నించారని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. వాళ్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వాళ్లే కారు ఓనర్ అశుతోష్, మరో నిందితుడు అంకుశ్ ఖన్నా. అయితే.. అంకుశ్ ఖన్నా.. అమిత్ ఖన్నా సోదరుడు. ఘటన జరిగిన సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉంది అమిత్ ఖన్నా. ఈ విషయాన్ని సోదరుడికి చెప్పాడు అమిత్. అమిత్ ఖన్నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీంతో సోదరుడికి ఏం జరగకూడదనే ఉద్దేశంతో కార్ ఓనర్ అశుతోష్‌ను కలిసి ఈ ప్రమాద ఘటన గురించి చర్చించాడు అంకుశ్. ఆపై ఎలాగోలా నేరం తనపైనే వేసుకునేలా దీపక్‌ను ఒప్పించారు. కారు నడిపింది అమిత్ ఖన్నా అని, ఘటన జరిగిన సమయంలో అసలు దీపక్ కారులోనే లేడని, ఇంట్లో ఉన్నాడని పోలీసులు తాజాగా వెల్లడించారు. డబ్బు ఆశ చూపించడం వల్లనో, స్నేహితుడనే కారణంతోనో ఆ నేరం తనపై వేసుకునేందుకు దీపక్ ముందుకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అశుతోష్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకుశ్ ఖన్నా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్కూటీపై వస్తున్న అంజలి సింగ్, నిధిలను కారుతో ఢీ కొట్టారు ఈ నిందితులు. నిధి పక్కకు పడిపోగా.. అంజలి కాలు కారు కింది భాగంలో ఇరుక్కుపోయింది. సాయం కోసం ఆమె అరుస్తుండగానే.. అదేం పట్టనట్లు ముందుకు వెళ్లిపోయారు కారులో ఉన్న వాళ్లు. అది చూసి భయంతో నిధి అక్కడి నుంచి జారుకుంది. అయితే కొద్ది దూరం వెళ్లాక అంజలి మోచేయి భాగం కనిపించిందని, అయినా మద్యం మత్తులో పట్టించుకోకుండా వాళ్లు ముందుకు వెళ్లిపోయారని తెలుస్తోంది. అలా గంట.. రెండు గంటల మధ్య సుల్తాన్‌పురి నుంచి 13 కిలోమీటర్ల పాటు ప్రయాణించి.. దారిలో యూటర్న్లు కొడుతూ.. కంఝావాలా వద్ద ఆమె మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చివరికి కారును అశుతోష్‌కు అప్పగించి.. ఓ ఆటోలో కారులోని నలుగురు పారిపోయారు. అంజలిని అలా ఈడ్చుకెళ్లే క్రమంలో ఆమె దుస్తులు చినిగిపోవడంతోపాటు తీవ్ర గాయాలై మరణించింది. శరీరంపై 40 గాయాలు అయ్యాయి. చర్మం ఒలుచుకుపోయి ఉంది. పక్కటెముకలు బయటకు పొడుచుకువచ్చాయి. తల పలిగి పుర్రె భాగం బయటకు వచ్చింది. సగం మెదడు ఎక్కడో పడిపోయింది అని శవ పరీక్షలో తేలింది. తల పగిలి, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడం, అవయవాలు దెబ్బ తినడంతో రక్తస్రావం జరిగి ఆమె మృతి చెందని పోస్ట్‌మార్టం నివేదికలో నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు అత్యాచారం జరగలేదని తేలింది. -
Kanjhawala Case:‘సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నం.. సీబీఐకి అప్పగించాలి’
Delhi Horror: ఢిల్లీ కారు ప్రమాదంలో మృతిచెందిన అంజలి సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనలో తవ్వేకొద్ది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయంలో ఢిల్లీ పోలీసులు స్పందించలేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. నిందితులకు ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సుల్తాన్‌పురి కారు ప్రమాద కేసులో పోలీసుల విచారణ సంతృప్తి కరంగా లేదంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఎస్ మలివాల్ మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిధి ఫోన్ స్వాధీనం చేసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అది ఈ కేసులో చాలా ముఖ్యమైన సాక్షం. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. పోలీసుల వైఫల్యం పోలీసులు ఇప్పటికీ యువతి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన 13 కిలోమీటర్ల దూరంలోని అన్నీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదు. 164 సీఆర్పీసీ ప్రకారం ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేదు. కారు చక్రాల కింద యువతి మృదేహం చిక్కుకుందని ఉదయం 2.22 నిమిషాలకు పోలీసులుకు సమాచారం వచ్చింది. కానీ పోలీసులు ఉదయం.4.15 నిమిషాలకు నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం రోడ్డుపై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 18 బృందాలుగా కాగా అంజలి సింగ్ కేసుపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. దీనిపై 18 బృందాలు పనిచేస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు అశుతోష్‌కు చెందినదిగా.. యాక్సిడెంట్ సమయంలో అమిత్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరి(అశుతోష్, అంకుష్) ప్రయేయం ఉన్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరిద్దరూ మిగతా అయిదుగురు నిందితులకు స్నేహితులని పేర్కొన్నారు. అయితే వీరు ప్రమాద సమయంలో కారులో లేరని, మిగిలిన ఐదుగురు నిందితులను రక్షించేందుకు ఇద్దరూ ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏ సంబంధం లేదు నిందితులకు మృతురాలు, ఆమె స్నేహితురాలు నిధితో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితులు అనేక సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇద్దరు కొత్త నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు కారు కింద అంజలి మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఆటోలో పరారయ్యాడని, అంజలి ఫోన్ ఇప్పటి వరకు దొరకలేదని వెల్లడించారు. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. #StandWithAnjali@priyanktripathi shares more information about Ashutosh, the main owner of the car involved in the death of Anjali.@Aditi14Bhardwaj dissects the details emerging from the latest CCTV footage which shows the accused getting down & checking the car. pic.twitter.com/PiRaH6j83d — TIMES NOW (@TimesNow) January 5, 2023 -
Delhi: అంజలి సింగ్ కేసులో మరో ఇద్దరి ప్రమేయం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పోగొట్టుకున్న అంజలి సింగ్(20) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పీకలదాక మద్యం సేవించి యువతి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఐదుగురిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీటీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుకు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఆశుతోశ్, అంకుశ్‌లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ‘కస్టడీలో ఉన్న ఐదుగురు కాకుండా మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. మా వద్ద సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నాలు చేశారు.’అని వెల్లడించారు సీనియర్ పోలీసు అధికారి సాగర్‌ప్రీత్ హుడా. కారు నడిపినట్లు మొదటి నుంచి భావిస్తున్న దీపక్ ఖన్నా కాదని, అమిత్ ఖన్నాగా పేర్కొన్నారు. అమిత్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించినట్లు చెప్పారు. #दिल्ली - कंझावला मामले में एक और नया सीसीटीवी आया सामने, जिसमें पांचो अरोपी कार से उतरते नज़र आए...#Delhiaccident #DelhiPolice #KanjhawalaDeathCase #Kanjhawala #Delhi #Delhiaccident #Nidhi #Kanjhawala #kanjhawalaaccident #Kanjhawala_girl_accident #KanjhawalaHorror pic.twitter.com/0qqrjlNw2N — TheuttarpradeshNews.com (@TheUPNews) January 5, 2023 ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!.. నిధి అసలు ఫ్రెండే కాదట! -
Delhi: అంజలి సింగ్ కేసులో ఊహించని మలుపు!
ఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పొగొట్టుకుంది అంజలి సింగ్(20). తాగుబోతుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం.. నరకం అనుభవిస్తూ విగతజీవిగా మారింది. ఢిల్లీని కుదిపేసిన సుల్తాన్‌పురి కేసు.. నిరసనలతో కేంద్రంలోనూ కదలికలు తీసుకొచ్చింది. అయితే పోలీసు దర్యాప్తు పట్ల బాధిత కుటుంబం సంతృప్తిగా ఉన్నా.. తాజాగా వాళ్లు ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఈ హిట్ అండ్ రన్ కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. ఘటన సమయంలో అంజలితో పాటు ఉన్న నిధి అనే స్నేహితురాలి స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారిన సంగతి తెలిసిందే కదా. అయితే తమ కూతురికి నిధి అనే స్నేహితురాలు లేనేలేదని అంజలి తల్లి రేఖా దేవి మీడియాకు తెలిపింది. అంతేకాదు.. ఆరోజు అంజలి ఆల్కాహాల్ తీసుకుందని మీడియా సాక్షిగా నిధి చెప్పిన మాటలపైనా ఆమె మండిపడ్డారు. ‘‘నిధి అనే అమ్మాయిని నేను, మా ఇంట్లో వాళ్లం ఎప్పుడూ చూడలేదు. ఆమె ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. అలాంటి స్నేహితురాలు మా అమ్మాయికి లేదు. తను అబద్ధం చెప్తోంది. నా కూతురు జీవితంలో ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోలేదు. నిధి అబద్ధం చెబుతోంది. పోలీసులు ఆమెను గట్టిగా విచారిస్తే.. అసలు విషయాలు బయటపడ్తాయి’’ అని రేఖా దేవి విజ్ఞప్తి చేస్తోంది. ఇక అంజలి మేనమామ మాట్లాడుతూ.. ‘‘ఆమె అబద్ధం చెప్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అసలామె ఎందుకు పట్టనట్లు ఉంది. పోలీసులకు కాదు కదా తన ఇంట్లో వాళ్లకైనా ఎందుకు చెప్పలేదు. ఇది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ హత్యే. నిధి పై కూడా హత్యానేరం నమోదు చేయాలి. నిందితులకు ఆమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో గుర్తించాలి’’ ఆయన పోలీసులను కోరుతున్నాడు. ఇదిలా ఉంటే అంజలి ఫ్యామిలీ డాక్టర్ భూపేష్.. ఆమెకు మద్యం తీసుకునే అలవాటు లేదని చెప్పాడు. అదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె శరీరంలో ఆనవాలు లేదని తేలిన విషయాన్ని గుర్తు చేశారు. ఘటనకు ముందు హోటల్లో ఆమె తీసుకున్న ఆహారం ఆనవాలు మాత్రమే కడుపులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైన విషయాన్ని డాక్టర్ భూపేష్ చెప్తున్నారు. నిధి స్టేట్మెంట్.. నిధి పోలీసులకు, మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు ముందు కొత్త ఏడాది స్వాగతం పలుకుతూ జరిగిన పార్టీలో అంజలి మద్యం సేవించింది. ఆపై ఇద్దరం స్కూటీపై బయల్దేరాం. నేను వెనకాల కూర్చున్నా. ఘటన జరిగిన సమయంలో స్కూటీని ఢీ కొట్టిన కారులో ఎలాంటి మ్యూజిక్ ప్లే కావడం లేదు. స్కూటీని ఢీ కొట్టాక.. అంజలి కాలు కారు కింద ఇరుక్కుంది. ఆమె నొప్పితో గట్టిగట్టిగా అరిచింది. ఆమె కారు కింద చిక్కుకుందని లోపల ఉన్నవాళ్లకు తెలుసు. కానీ, స్లో చేయడం గానీ, ఆమెను రక్షించే ప్రయత్నంగానీ చేయకుండా ఏం పట్టన్నట్లు లాక్కుని వెళ్లిపోయారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. ఆ ప్రమాదానికి నన్నే నిందిస్తారనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయా.. అంతే! అని నిధి మీడియాకు తెలిపింది. She is Nidhi who was with #AnjaliSingh during the fateful New Year's night. She reportedly left the spot after Anjali's scooty was hit by Baleno car. Nidhi told @DelhiPolice she was sitting pillion & escaped with minor injuries. Quite strange @AlokReporter @TheNewIndian_in pic.twitter.com/S6u9Iechkc — Pramod Kumar Singh (@SinghPramod2784) January 4, 2023 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిధిని ట్రేస్ చేసిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం సేకరించారు. ఘటన స్థలం నుంచి 150 మీటర్ల దూరంలోని ఓ గల్లీలో ఆమె(నిధి) వెళ్తుండగా.. అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఇదిలా ఉంటే.. అంజలి ఘటనలో నిధి వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు ఐదుగురు నిందితులు ఘటన సమయంలో తాము మద్యం మత్తులో ఉన్నామని, కారులో ఫుల్ సౌండ్ ఉన్నందున అంజలి కారు కింద ఉన్న విషయం గమనించలేకపోయామని చెప్తున్నారు. A car dragged a girl for a few Kms after hitting her two-wheeler in #Delhi's #Kanjhawala. The girl, #AnjaliSingh, died & her naked body was found later. The accused have been identified as Deepak Khanna, Amit Khanna, Krishan, Mithun & Manoj Mittal. pic.twitter.com/aP3adlKkFR — Sarthak Rohilla (@SarthakRohilla2) January 2, 2023 అయితే.. ప్రధాన నిందితుడు, డ్రైవర్ సీట్లో ఉన్న దీపక్ ఖన్నా మాత్రం కారు దేని మీద నుంచో వెళ్తున్నట్లు అనిపించిందని చెప్పగా, మిగతా వాళ్లు మాత్రం తాము అలాంటిదేం గుర్తించలేదని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. -
‘రక్తమోడుతున్నా ఈడ్చుకెళ్లారు’.. ఢిల్లీ దారుణంపై ప్రత్యక్ష సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో యువతిని స్కూటీతో పాటు కారు కింద కిలోమీటర్ల మేరకు ఈడ్చి పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఢీకొనడంతో చక్రాల కింద ఇరుక్కుని, కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని నిధి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతురాలు అంజలీ సింగ్‌కు ఆమె స్నేహితురాలే. ఘటన జరిగినప్పుడు అదే స్కూటీపై అంజలీ వెనక కూచొని ఉంది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. షాక్‌తో ఘటన వివరాలను ఆమె ఇంతవరకూ బయట పెట్టలేదు. స్కూటీపై మరో మహిళ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ఆరా తీసి ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన దారుణం గురించి నిధి వెల్లడించారు. ‘‘మా పరిచయమై 15 రోజులే అయినా మంచి స్నేహితులమయ్యాం. కొత్త ఏడాది వేడుక కల్సి చేసుకుందామనుకున్నాం. హోటల్లో పార్టీ తర్వాత 2 గంటలపుడు బయటకొచ్చి స్కూటీపై వెళ్తున్నాం. ఎదురుగా వస్తున్న కారు హఠాత్తుగా మమ్మల్ని ఢీకొట్టింది. నేను పడిపోయా. కానీ అంజలీ కారు చక్రాల్లో ఇరుక్కుని రక్తమోడుతూ సాయం కోసం అరిచింది. అయినా వాళ్లు వేగంగా అలాగే ఆమెను కారుతో పాటుగా ఈడ్చుకెళ్లారు. వెంటనే ఆపితే ఆమె కచ్చితంగా బ్రతికేది. చక్రాల్లో ఆమె ఇరుక్కుందని తెలిసీ నిర్దయగా అలాగే వెళ్లిపోయారు. ఆ దారుణాన్ని చూసిన షాక్‌లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’’ - నిధి, బాధితురాలి స్నేహితురాలు, ప్రత్యక్ష సాక్షి అయితే స్కూటీ ఎక్కడానికి ముందు హోటల్ బయట వారిద్దరూ గొడవ పడుతున్నట్టు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. నిధి నుంచి ఏదో లాక్కోవడానికి అంజలి ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. బహుశా స్కూటీని ఎవరు నడపాలనే విషయమై వారు వాదించుకున్నారని భావిస్తున్నారు. కాగా ఈ కేసులో అత్యాచారం ఆనవాళ్లు లేవని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తల, వెన్నెముక, మొండెం కింది అవయవాలకు తీవ్ర గాయాలవడంతో అంజలీ మరణించినట్టు నివేదిక పేర్కొంది. నిందితులు ఆమెను రేప్ చేసి చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో మెడికల్ బోర్డు పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం జరిగిందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా చెప్పారు. ఝౌంతీ గ్రామంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం తెల్సిందే. కేసును నీరుగారుస్తున్నారు: ఆప్ దర్యాప్తు వేగంగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ‘ఆప్’ ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కేంద్రం సీరియస్ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దాంతో స్పెషల్ కమిషనర్ శాలినీ సింగ్ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ విభాగం దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఘటన సమయంలో ఇద్దరు నిందితులు తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారని, రిపోర్టులు రావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఏకైక దిక్కు మృతురాలు అంజలి తన కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు. తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే మరణించాడు. అక్కకు పెళ్లయింది. దాంతో అమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను ఆమే పోషిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. మూత్రపిండాలు దెబ్బ తిన్న తల్లికి తరచూ డయాలసిస్ అవసరం. ఇదీ చదవండి: ఢిల్లీ సుల్తాన్‌పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా? -
అంజలి కారు ముందు పడిపోయింది.. భయంతో పారిపోయా: స్నేహితురాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో ఆమెతోపాటు తన స్నేహితురాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు కారు ఢీకొట్టిన సమయంలో అంజలి ఒకరే ఉన్నారని అనుకున్నారు కానీ హోటల్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పార్కింగ్ నుంచి స్కూటీ తీస్తుండగా పక్కన మరో యువతి కూడా కనిపించింది. ఆమే అంజలి స్నేహితురాలు నిధి. ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం సుల్తాన్‌పురిలో న్యూ ఇయర్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటలకు హోటల్ నుంచి అంజలి స్కూటర్‌పై బయలుదేరారు. ముందుగా స్కూటీ డ్రైవ్ చేసే విషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. టూవీలర్‌ను మొదట నిదీనే డ్రైవ్ చేయగా కొంత సమయం తర్వాత అంజలి డ్రైవింగ్ తీసుకుంది. నిధి వెనకాల కూర్చుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం మత్తులో అయిదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో అంజలి కారు ముందు పడిపోగా.. నిధి మరోవైపు పడింది. అదృశవశాత్తు ఆమెకు గాయాలేవి అవలేదు. కానీ అంజలి కారు ముందు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను కారుతోపాటే వీధుల గుండా 13 కిమీ ఈడ్చుకెళ్లారు. #WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area. (CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze — ANI (@ANI) January 3, 2023 డ్డ్రైవర్ తప్పిదం వల్లే నిధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు ఆమె సహకరిస్తోందని తెలిపారు. మంగళవారం నిధిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది. భయంతో ప్రమాదం గురించి ఎవరికీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు నిధి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. స్కూటర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని నిందితులు పేర్కొన్నారు. మరోవైపు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సైతం ప్రకటించారు. అత్యాచారం జరగలేదు మరోవైపు అంజలిపై హత్యాచారం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ ఆందోళనలు చేపట్టారు. అయితే అంజలిపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇక కారు డ్రైవ్ చేసిన వ్యక్తితోపాటు మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. వారిపై నేరపూరిత హత్య అభియోగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ఈవెంట్ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్‌ను ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో జనవరి 1వ తేదీ తెల్లవారు జామున కొంతమంది యువకులు కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. స్కూటర్‌ను ఢీకొట్టడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే మహిళ శీరరం కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం వారికి తెలియలేదు. సుల్తాన్పూరి నుంచి కంజావాలా వరకు 13 కిలోమీటర్ల మేరకు ఆమెను అలాగే ఈడ్చుకెళ్లారు. చివరికి కంజావాలా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో మహిళ కారుతోపాటు రావడాన్ని గమనించిన కారులోని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారు ఆపడంతో ఆమె శరీరం పడిపోయింది. దీంతో మళ్లీ అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అయితే కారుతోపాటు రోడ్డుపై మహిళ శరీరం ఈడ్చుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులుకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్‌గా గుర్తించారు. వీరకి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీపక్ ఖన్నా అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. స్కూటీనిని ఢీ కొట్టిన సమయంలో దేని మీద నుంచో కారు ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ పోలీసుల ఎదుట అంగీకరించాడు, అయితే మిగతావాళ్లు మాత్రం తామకు అలాంటిది ఏం అనిపించలేదని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోయినట్లు తెలిపారు. -
ఢిల్లీ ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!
ఢిల్లీ: దేశ రాజధానిలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరం మొదటిరోజు వేకువ జామున ప్రాణం పోయి రోడ్డు మీద నగ్న స్థితిలో బాధితురాలు కనిపించిన ఘటన ఢిల్లీని కుదిపేసింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే పోలీసుల దర్యాప్తులో.. ఈ హేయనీయమైన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. ఘటన సమయంలో అంజలితో పాటు మరో యువతి కూడా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆమెను అంజలి స్నేహితురాలిగా భావిస్తున్నారు. అయితే కారు ఢీ కొట్టడంతో స్కూటీ నుంచి కింద పడి గాయాలైన ఆ యువతి.. భయంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరి ఉండొచ్చని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, ఆమెను విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడొచ్చని ఆ సీనియర్ అధికారి వెల్లడించారు. #WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area. (CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze — ANI (@ANI) January 3, 2023 పోలీసులు పట్టించుకోలేదు: ప్రత్యక్ష సాక్షి ఇక ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితులు, వాళ్ల నుంచి స్టేట్మెంట్ రికార్డు నమోదు చేసిన పోలీసులు ప్రకటించారు. కానీ, ప్రత్యక్ష సాక్షి దీపక్ మాత్రం కారులో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని కారుతో లాక్కెళ్లారని, గంటన్నర పాటు పలుమార్లు యూటర్నులు తీసుకుంటూ దాదాపు 13 కి.మీ. దూరం వాహనాన్ని నడిపారని వెల్లడించడం కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు.. అరుస్తూ తన టూవీలర్‌పై కారును వెంబడించినట్లు అతను తెలిపాడు. ఆపై పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్‌ను ఆపి విషయం దృష్టికి తీసుకెళ్లినా.. కనీసం వాళ్లు స్పందించలేదని, ఆ కారును ఆపే యత్నం చేయలేదని దీపక్ ఆరోపించాడు. ఆపై గంటన్నర సమయంలో 20 సార్లు ఫోన్ చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని దీపక్ మీడియాకు వెల్లడించాడు. మరోవైపు రోడ్డులో పోలీస్ బారికేడ్లు చూసి కారు యూటర్న్ తీసుకోవడం తాను చూసినట్లు ఓ ఫుడ్ డెలివరీ బాయ్ తెలిపాడు. కారుతో నిర్దాక్షిణ్యంగా బాధితురాలిని లాక్కెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దర్యాప్తునకు అమిత్ షా ఆదేశం ఢిల్లీ ఘటన కుదిపేస్తుండడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ తరపున విచారణకు ఆదేశించారు. ఢిల్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ షాలిని సింగ్‌ను దర్యాప్తునకు నేతృత్వం వహించాలని, వీలైనంత త్వరగతితన నివేదిక అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంకోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కూడా పోలీసులకు నోటీసులిచ్చారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందా అన్న విషయాన్ని తెలపాలని ఆదేశించింది. నేడు శవపరీక్ష నివేదిక వచ్చే అవకాశం ఉండడంతో.. అసలేం జరిగింది అనే దానిపై ఒక స్పష్టత రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ముమ్మాటికీ హత్యాచారమే! ఇదిలా ఉంటే.. సుల్తాన్‌పురి ఘటనపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. తమ కూతురిపై హత్యాచార జరిగి ఉంటుందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని పలు సంఘాలు, స్థానికులు సుల్తాన్‌పురి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి రహదారిని దిగ్బంధం చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము ఉద్యమించడం ఆపబోమని ప్రకటించారు. భయమా? కావాలనేనా? ఆఫీస్ ముగించుకుని అర్ధరాత్రి(జనవరి 1వ తారీఖు) రెండు గంటల సమయంలో అంజలి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అంజలి ప్రయాణిస్తున్న స్కూటీని నిందితుల కారు ఢీ కొట్టింది. ఘటనకు కారణమైన కారు.. మారుతి బలెనో అసలు ఓనర్ లోకేష్. అతని నుంచి అశుతోష్ అనే వ్యక్తి కారును తీసుకోగా, మళ్లీ అశుతోష్ నుంచి అమిత్, దీప్ ఖన్నాలు కారు తీసుకుని తప్పతాగి చక్కర్లు కొట్టారు. ఖన్నాలతో పాటు స్థానిక బీజేపీ నేత.. రేషన్ షాప్ నడిపించే మనోజ్ మిట్టల్, స్పానిష్ కల్చరల్ సెంటర్లో పని చేసే కృష్ణన్, హెయిర్‌డ్రెస్సర్‌గా పని చేసే మిథున్ కూడా కారులోనే ఉన్నారు. దీపక్ ఖన్నా కారు డ్రైవ్ చేయగా.. మనోజ్ పక్క సీట్లో ఉన్నాడు. కారు ఢీ కొట్టిన దేనిమీద నుంచో ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ అంగీకరించాడు. అయితే మిగతా వాళ్లు మాత్రం తాము అలాంటిదేం గమనించలేదని చెప్పినట్లు తెలుస్తోంది. స్కూటీని ఢీ కొట్టిన తర్వాత భయంతోనే వాళ్లు అక్కడి నుంచి ఉడాయించినట్లు చెప్తున్నారు. హత్యానేరం కింద కాకుండా.. దోషపూరిత హత్య(culpable homicide) అభియోగం కింద వాళ్లపై కేసులు నమోదు చేశారు. అయితే.. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా వాళ్లపై కేసు నమోదు మారే అవకాశం ఉంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఆప్ సైతం నిరసనలకు మద్ధతు ప్రకటించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఢిల్లీ ఘటన: కుటుంబానికి అంజలి ఒక్కతే ఆధారం.. ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. కారు చక్రాల మధ్యలో చిక్కుకొని కిలోమీటర్ల మేర మహిళను ఈడ్చుకెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా ఛిద్రమైంది. తీవ్ర గాయాలపాలైన సదరు మహిళ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఢిల్లీ ఘటనలో మృతిచెందిన బాధితురాలిని అమర్ విహార్‌కు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను నిర్వహించే ఈవెంట్ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటిలాగే కార్యక్రమ పనులు ముగించుకొని డిసెంబర్ 31న రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అంజలి తన తల్లి, నలుగురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి జీవిస్తోంది. పిల్లల్లో అంజలి పెద్దది. ఎనిమిదేళ్ల క్రితమే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను అంజలి తన భూజాన వేసుకుంది. కుటుంబ పోషణ మొత్తం ఆమె ఒక్కతే చూసుకుంటోంది. తను పనిచేసి సంపాదిస్తే కానీ కుటుంబం గడవదు. కుటుంబానికి పెద్ద దిక్కైన అంజలి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డిసెంబర్ 31న సాయంత్రం ఆరుగంటలకు న్యూ ఇయర్ ఈవెంట్ కోసం అంజలి బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 9 గంటలకు కాల్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. రాత్రి 10 గంటలకు మళ్లీ కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చిందని, ఉదయం 8 గంటల సమయంలో కూతురు ప్రమాదానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు చెప్పినట్లు విలపించారు. అంజలి మృతదేహం నగ్నంగా కనిపించిన తీరు 2012 నిర్భయ అత్యాచార ఘటనను తలపించిందని వాపోయారు. నిందితులను పోలీసులు రక్షిస్తున్నారని ఆమె కుటుంబం ఆరోపించింది. ఇది యాక్సిడెంటల్‌గా జరగలేదని ఉద్దేశ పూర్వకంగానే చేశారంటూ ఆమె తల్లి, మేనమామ ఆరోపిస్తున్నారు. ఏం జరిగిందంటే ఆదివారం తెల్లవారు జామున స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టిన కొంతమంది యువకులు అక్కడితో ఆగకుండా కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. రోహిణిలోని కంజావాల్ నుంచి కుతూబ్‌గఢ్ వైపు వెళ్తున్న కారు మహిళను ఊడ్చుకెళ్తున్నట్లు ఆదివారం తెల్లవారు జామున 3.24 నిమిషాలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అన్ని చెక్‌పోస్టులను అలెర్ట్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి కారు నెంబర్ కూడా చెప్పడంతో వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతలోనే రోడ్డుపై నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం పడి ఉన్నట్లు ఉదయం 4 గంటలకు కంజావాలా పోలీసులకు మరో కాల్ వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను మంగోల్‌పురిలోని ఆసుపత్రికి తరలించారు. మహిళ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. చాలా దూరం కారుతో ఊడ్చుకెళ్లడంతో మహిళ వెనకవైపు శరీరమంతా తీవ్రంగా గాయపడినట్లు, కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. తలకు గాయమవ్వడంతోపాటు చేతులు మరియు కాళ్లు విస్తృతంగా కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. మరోవైపు మహిళను ఢీకొట్టిన అనంతరం కారులోని వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యారు. మహిళను అలాగే సుల్తాన్పూరి నుంచి కంజావాలా వరకు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. కారుతో మహిళను ఈడ్చుకెళ్లిన ఘటనపై రాజకీయ దుమారం కూడా రాజుకుంది. న్యూ ఇయర్ వేళ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టక పోవడంపై, నిందితులు ఏ ఒక్క చెక్‌పోస్టు వద్ద పట్టుబడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు చేపట్టారు. వైరల్ వీడియో మహిళను కారు ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంజావాలా ప్రాంతంలో కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో కారు కింద మహిళ చిక్కుకుని ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లవారుజామున 3.34 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. Clear CCTV of Delhi Kanjhawala Accident where girl dragged for few KM #Kanjhawala #delhi @SwatiJaiHind @RahulGandhi pic.twitter.com/Di1T2B7o4h — Sachin Tiwari (@SachinReport) January 1, 2023 నిందితులు ఎలా చిక్కారంటే.. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్‌గా గుర్తించారు. అరెస్టయిన వారిలో క్రెడిట్ కార్డు కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాపు యజమాని ఉన్నారు. ఘటన సమయంలో దీపక్ కారు డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. సుల్తాన్‌పురి ప్రాంతంలో తమ కారు స్కూటీని ఢికొట్టిన్నట్లు నిందితులు అంగీకరించారు. కానీ మహిళ కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం తమకు తెలీదని తెలిపారు. నిందితులంతా మద్యం మత్తులోకారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని సోమవారం కోర్టులో హజరుపరచగా.. మూడు రోజుల కస్టడీకి అప్పగించింది. #Delhi: People gather to protest outside Sultanpuri Police station regarding the death of a woman who died after she was dragged for a few kms by a car that hit her in Sultanpuri area on January 1. pic.twitter.com/TJYkeSvO6g — TOI Delhi (@TOIDelhi) January 2, 2023 -
నిద్రమత్తులో ఉన్న భార్యపై గొడ్డలితో దాడి..ఆపై భర్త కూడా..
సాక్షి, పరిగి: నిద్రమత్తులో ఉన్న భార్యను గొడ్డలికామతో తలపై కొట్టి హత్య చేసి.. ఆపై దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి భీమయ్య (55) కావలి పెంటమ్మ(50) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరి వివాహం చేసి అత్తవారిళ్లకు పంపించారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా భీమయ్య మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. ఎప్పటిలాగే దంపతులిద్దరూ గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో పెంటమ్మ నిద్రలోకి జారుకోగా భీమయ్య లేచి గొడ్డలి కామతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్య చనిపోయిందనే భయంతో భీమయ్య కూడా దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీ పనికి తీసుకెళ్లేందుకు పెంటమ్మ వద్దకు వచ్చిన గ్రామస్తులు తలుపులు గడియ పెట్టి ఉండటాన్ని గమనించారు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అందరూ వచ్చిన తర్వాత గడియ పగలగొట్టి చూడగా.. పెంటమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. భీమయ్య దూలానికి వేలాడుతూ కనిపించాడు. వీరి పెద్ద కూతురు కృష్ణవేణి అత్తవారి ఇంటి వద్ద జరుగుతున్న భూవివాదాల నేపథ్యంలో మృతులు కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భీమయ్య మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. కూతురు కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి) -
చెంపపై కొట్టి... కేజ్రీవాల్ కు క్షమాపణ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ను చెంప దెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్ క్షమాపణలు చెప్పారు. నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆటో డ్రైవర్ లాలీ అన్నారు. నేను పెద్ద తప్పే చేశాను. నా జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు. నా దృష్టిలో కేజ్రీవాల్ దేవుడు అని దాడికి పాల్పడిన లాలూ అన్నారు. దక్షిణ ఢిల్లీలోని సుల్తాన్ పురిలో జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ ను దండ వేసి చెంపపై కొట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడిలోకంటికి గాయం కావడంతో కేజ్రీవాల్ ప్రచారం మధ్యలోనే ఆపి వేసి వెళ్లారు. ఆతర్వాత ఆటో డ్రైవర్ ను ఆప్ కార్యకర్తలు చితకబాదారు. అయితే దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్.. కేజ్రీవాల్ ను క్షమాపణలు కోరారు. కేజ్రీవాల్ ను క్షమించాలంటూ కాళ్లకు వంగి దండం పెట్టడానికి వచ్చిన లాలీని మనీష్ సిసోడియా వారించారు. గత కొద్దికాలంగా కేజ్రీవాల్ ను కలిసేందుకు ప్రయత్నించాను. ఆయనను కలువడానికి జనతా దర్బార్ కు వెళ్లాను అని మీడియాకు తెలిపారు. గత వారం రోజుల్లో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండవసారి.