
ముగ్గురు విద్యార్థులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం ముగ్గురు విద్యార్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో సైకిల్‌పై పుణె యూనివర్సిటీ విద్యార్థులు శాంతియాత్రకు బయలుదేరి వెళ్లారు.
మార్గం మధ్యలో బైరాంగఢ్ ప్రాంతం వద్ద మావోయిస్టులు అడ్డగించి ముగ్గురు విద్యార్థులను కిడ్నాప్ చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.