సూటేసుకుని.. టై కట్టుకుని.. బుద్ధిగా! | mark zuckerberg meets narendra modi in a suite and tie | Sakshi
Sakshi News home page

సూటేసుకుని.. టై కట్టుకుని.. బుద్ధిగా!

Published Sat, Oct 11 2014 9:31 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

సూటేసుకుని.. టై కట్టుకుని.. బుద్ధిగా! - Sakshi

సూటేసుకుని.. టై కట్టుకుని.. బుద్ధిగా!

ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ సాధారణంగా ఎక్కడైనా సరే ఓ టీషర్టు, జీన్సు ప్యాంటు వేసుకుని, స్నీకర్స్ తొడుక్కుని వెళ్లిపోతాడు. కానీ.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవడానికి వెళ్లినప్పుడు మాత్రం బాగా డార్క్ కలర్ సూట్ వేసుకుని, టై కూడా కట్టుకుని మరీ బుద్ధిమంతుడైన విద్యార్థిలా వెళ్లి కూర్చున్నాడు. తమ సోషల్ మీడియా కారణంగా మారుమూల గ్రామాల వాళ్లకు కూడా ప్రధానమంత్రి అంటే ఎవరో, ఆయనేంటో తెలుస్తోందని జుకెర్బెర్గ్ అన్నాడు. భారతదేశంలో కేవలం 24.3 కోట్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని, ఇక్కడ ఇంకా చాలా విస్తరించే అవకాశం ఉందని తెలిపాడు. వందకోట్ల మందికి పైగా ప్రజలు ఇంకా ఇంటర్నెట్ పొందాల్సి ఉందని, ఇది కేవలం ఒక్క ఫేస్బుక్కే కాక.. అందరికీ సమస్యేనని అన్నాడు.

రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన మార్క్ జుకెర్బెర్గ్.. ఇక్కడ ఇంటర్నెట్.ఆర్గ్ నిర్వహించే ఓ సదస్సులో కూడా పాల్గొంటున్నాడు. కనెక్టివిటీ అనేది ప్రస్తుత తరానికి ప్రాథమిక హక్కు అని చెప్పాడు. భారతదేశం తమకు చాలా ముఖ్యమైనదని, ఇక్కడ అంతగా జనానికి నచ్చని యాప్లు ప్రవేశపెట్టి రిస్కు తీసుకోలేమని తెలిపాడు. అందుకే జాంబియాలో ప్రవేశపెట్టిన యాప్ను ఇక్కడకు తేవట్లేదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement