బెంగళూరు: అరుణగ్రహంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 5న పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మలిదశ యాత్రను ప్రారంభించనుంది. ఆదివారం తెల్లవారుజామున 12:49 గంటలకు మామ్‌ను భూమి కక్ష్య నుంచి అరుణగ్రహ మార్గంలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కీలకమైన ట్రాన్స్-మార్స్ ఇంజెక్షన్(టీఎంఐ) ప్రక్రియను చేపట్టనున్నారు.
మామ్‌లోని ద్రవ అపోజీ మోటార్(ఎల్‌ఏఎం)ను 23 నిమిషాల పాటు మండించి ఉపగ్ర హ వేగాన్ని సెకనుకు 648 మీటర్లకు పెంచనున్నారు. దీనివల్ల భూ ప్రభావ క్షేత్రాన్ని తప్పించుకుని మామ్ అంగారక మార్గంలోకి వెళ్లనుంది. అనంతరం రోదసీలో 10 నెలలపాటు 68 కోట్ల కి.మీ. ప్రయాణించి వచ్చే సెప్టెంబరులో అంగారకుడి సమీపానికి, 24న ఆ గ్రహ కక్ష్యలోకి చేరనుంది.
నేడు భూకక్ష్యను వీడనున్న ‘మామ్’
Published Sat, Nov 30 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement