'మా నేతకు భారతరత్న ఇచ్చి గౌరవించండి'
న్యూఢిల్లీ: తమ నేత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు కాన్షి రామ్‌కు దేశంలోని అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. 'ఈ రోజు కాన్షిరామ్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను కేంద్రం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను.
బడుగు బలహీన వర్గాల ఉన్నతికి జీవితాంతం కృషి చేసిన కాన్షిరాంను గుర్తించి ఆయనకు భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించాలి' అని ఆమె రాజ్యసభలో డిమాండ్ చేశారు. కాన్షిరాం కృషి వల్లే నేడు బడుగు బలహీన వర్గాల తమ కాళ్లపై నిలబడుతున్నారని అన్నారు.