ఎంసీఆర్‌సీ ఉత్తమ విద్యాసంస్థగా ఎంపిక కావడం ఇది రెండోసారి. ఇదే యూనివర్సిటీకి చెందిన లా విభాగం ఆరో స్థానంలో, ఆర్కిటెక్చర్ విభాగం ఏడో స్థానంలో నిలిచాయి. ప్రముఖ మ్యాగజైన్ అవుట్‌లుక్ దేశంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని విద్యాసంస్థలపై నిర్వహించిన సర్వేలో ఎంసీఆర్‌సీకు మొదటిస్థానం దక్కింది. ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, ఆర్కిటెక్చర్, లా, ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్‌మెంట్, సోషల్ వర్క్, మాస్ కమ్యూనికేషన్‌లకు చెందిన దాదాపు 1700 కాలేజీలపై సర్వే నిర్వహించింది. నాణ్యమైన విద్య, సదుపాయాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టారు.
ఎంసీఆర్‌సీ.. ది బెస్ట్ స్కూల్!
Published Mon, Jun 27 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన అనుబంధ విద్యా సంస్థ దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా గుర్తింపు దక్కించుకుంది. జామియా మిలియా ఇస్లామియా మాస్ కమ్యూనికేషన్ రిసెర్చ్ (ఎంసీఆర్‌సీ) స్కూల్ ఈ ఏడాదికిగాను ఉత్తమ విద్యాసంస్థగా ఎంపికైనట్లు యూనివర్సిటీవర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement