
మంత్రిని లేపతున్న మారథాన్ నిర్వాహకులు
సాక్షి, బెంగళూరు : దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్‌లో నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో కర్ణాటక విద్యాశాఖ మంత్రి జీటీ దేవగౌడ పాల్గొన్నారు. స్థానికులతో కలసి ఉత్సాహంగా పరుగెత్తారు. అయితే కొంత దూరం పరుగెత్తిన అమాత్యులు అలవాటు లేని పని కావడంతో బొక్కబోర్లా పడ్డారు. దీంతో అతని మోకాళ్లకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన మారథాన్ నిర్వాహకులు మంత్రిని పక్కకు తీసుకెళ్లారు.
అందరూ రన్నింగ్‌కు సౌకర్యాంగా ఉండే దుస్తులతో పరుగెత్తితే మంత్రి గారు మాత్రం లుంగీ పైకి కట్టి పరుగెత్తాడు. దీంతోనే పరుగు చేస్తూ నియంత్రణ కోల్పోయి పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment