
పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం
భారత పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంట్ ఆవరణలోని ఓ గదిలో నుంచి పొగలు రావడం గ్రహించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.