ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు? | MNS can't decide what people will watch: Babul Supriyo | Sakshi
Sakshi News home page

ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు?

Published Thu, Oct 20 2016 1:59 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM

ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు? - Sakshi

ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు?

న్యూఢిల్లీ: సినిమా ధియేటర్లపై దాడులు చేసే హక్కు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)కు లేదని కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో అన్నారు. ఎమ్మెన్నెస్ రౌడీల పార్టీ అని దుయ్యబట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, చూడకూడదో నిర్ణయించే అధికారం ఎమ్మెన్నెస్ లేదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం సరికాదన్నారు.

ఉడీలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాతే పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిందని, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు భారత్-పాక్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు తీసినవని వివరించారు.

కాగా, నిన్న తనపై దాడి చేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement