సాక్షి, న్యూఢిల్లీ: తీహార్ జైలులో విచారణలో ఉన్న ఒక ఖైదీని కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత తిరిగి జైలుకు తీసువచ్చారు. ఆ ఖైదీని తనిఖీ చేస్తుండగా అతని కడుపులో నుంచి ఫోన్ రింగ్ వినిపించింది. తొలుత అది ఎక్కడి నుంచి వస్తున్నదనేది అధికారులు గుర్తించలేకపోయారు. అయితే ఖైదీ దగ్గరి నుంచి వస్తోందని మాత్రం గ్రహించారు. మరింతగా పరిశీలించేసరికి ఆ ఖైదీ కడుపులో నుంచి ఈ శబ్ధం వస్తున్నదని పసిగట్టారు.
దీంతో ఆ ఖైదీని వారు ప్రశ్నించగా తాను అతిచిన్న ఫోనును, ఛార్జర్ లీడ్‌ను మిగేశానని తెలిపాడు. దీంతో జైలు అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. తరువాత పోలీసులు ఆ ఖైదీ కడుపులో నుంచి ఫోనును బయటకు తీసుకురాగలిగినా, ఛార్జర్ మాత్రం రాలేదు. ఇప్పటికీ అది అతని కడుపులోనే ఉండిపోయింది. ఈ ఘటన తీహార్ జైలు జరిగింది. కాగా ఈ ఖైదీ గతంలోనూ జైలు లోనికి ఫోను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూ పట్టబడ్డాడని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment