న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పొందిన 1,800పైగా మెమొంటోల వేలం ద్వారా నిధులను ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వ పథకమైన నమామి గంగే కింద గంగానది ప్రక్షాళనకు వినియోగించనున్నట్లు పేర్కొంది. గత నెలలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ ఆధ్వర్యంలో రెండు వారాల పాటు మోదీ పొందిన మెమొంటోలను వేలం వేసిన సంగతి తెలిసిందే. ఇందులో చెక్కతో చేసిన వినూత్న బైక్‌కు వేలంపాటలో రూ.5 లక్షలు రాగా, రైల్వే ప్లాట్‌ఫామ్‌లో ఉంచిన నరేంద్ర మోదీ చిత్రలేఖనానికి కూడా ఇంతే మొత్తం లభించింది.
ఇంకా..రూ.5వేలు విలువ చేసే శివుడి విగ్రహాన్ని వేలం వేయగా, రూ.10 లక్షలు పొందినట్లు పీఎమ్‌వో తెలిపింది. రూ.4వేల విలువ చేసే చెక్కతో చేసిన అశోక స్తంభం ప్రతిరూపం రూ.13 లక్షలకు అమ్ముడుపోయినట్లు పేర్కొంది. అలాగే రూ.2 వేలు విలువ చేసే అస్సాంలోని మజూలి సంప్రదాయ ‘హొరాయి’ ద్వారా రూ.12 లక్షలు, రూ.4 వేలు విలువ చేసే గౌతమ్ బుద్ధ విగ్రహానికి వేలంలో రూ.7 లక్షలు వచ్చినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment